Baby Learn to Walk Safely: పిల్లలు నడక నేర్చుకుంటున్నారా
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:53 AM
సాధారణంగా పిల్లలు నడక నేర్చుకునే క్రమంలో చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. అలాకాకుండా పిల్లలు తప్పటడుగులు వేసేటప్పుడు తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో...
సాధారణంగా పిల్లలు నడక నేర్చుకునే క్రమంలో చిన్న చిన్న దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. అలాకాకుండా పిల్లలు తప్పటడుగులు వేసేటప్పుడు తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
పిల్లలు నిలబడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్లని వాకర్‌లో కూర్చోబెట్టాలి. వాకర్‌ను మెల్లగా ముందుకు జరుపుతుంటే... పిల్లలు నిటారుగా నిలబడడం, అడుగులు వేయడం నేర్చుకుంటారు. అలాగని పిల్లలను గంటలకొద్దీ వాకర్లో ఉంచితే... వాళ్లకు నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. పిల్లలు వాకర్లో ఉన్నంతసేపు వాళ్లని గమనిస్తూ ఉండాలి.
పిల్లలు బుడి బుడి అడుగులు వేసేటప్పుడు వాళ్లకి పొడవాటి డ్రెస్‌లు వేయకూడదు. ఒక్కోసారి అవి కాళ్లకు అడ్డుపడి పిల్లలు కిందపడిపోయే అవకాశం ఉంటుంది. చేతి వేళ్లను పట్టుకుని నడిపిస్తుంటే పిల్లలు నడవడం నేర్చుకుంటారు.
పిల్లలు ఇంటి పరిసరాల్లో నడిచేటప్పుడు పాదాలకు సాక్స్, బయటికి తీసుకువెళ్లేటప్పుడు మెత్తని షూస్ వేయాలి. లేదంటే రాళ్లు, ఇసుక లాంటివి గుచ్చుకుని పాదాలు కందిపోతాయి. ఒక్కోసారి పిల్లలు రెండు లేదా మూడు అడుగులు వేసి అకస్మాత్తుగా ముందుకు పడిపోతుంటారు. అలాంటప్పుడు దెబ్బలు తగలకుండా అరచేతులకు గ్లౌజ్‌లు వేయాలి.
నడక నేర్చుకుంటున్న పిల్లలు... మంచం, ఉయ్యాల, సోఫా, ఇంటి ముందున్న మెట్లు దిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా దిగుతూ ఒక్కోసారి కింద పడిపోయి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లలు నడక నేర్చుకునే రెండు లేదా మూడు నెలలపాటు వాళ్లని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News