Vitamin D Naturally: డి విటమిన్ కోసం
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:19 AM
ఎముకలు, కండరాల బలోపేతానికి; గోర్లు, దంతాల సంరక్షణకు; మధుమేహం నివారణకు, రక్తపోటును నియంత్రించేందుకు, రోగనిరోధక శక్తికి డి విటమిన్ అత్యవసరం...
ఎముకలు, కండరాల బలోపేతానికి; గోర్లు, దంతాల సంరక్షణకు; మధుమేహం నివారణకు, రక్తపోటును నియంత్రించేందుకు, రోగనిరోధక శక్తికి డి విటమిన్ అత్యవసరం. అలాంటి డి విటమిన్.. శరీరానికి సహజసిద్ధంగా ఎలా లభిస్తుందో తెలుసుకుందాం...
రోజూ శరీరానికి నువ్వుల నూనెతో మర్ధన చేసుకుని పావు గంట సేపు ఎండలో నిలబడితే శరీరానికి కావాల్సిన డి విటమిన్ సులభంగా లభిస్తుంది.
పుట్టగొడుగులు, కోడిగుడ్డు పచ్చ సొన, రెడ్ మీట్, నల్ల నువ్వులు, నెయ్యిలో డి విటమిన్ అధికంగా ఉంటుంది. వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది.
సాల్మన్, ట్యూనా, మాకెరెల్ లాంటి చేపలతో తయారుచేసిన వంటకాలు తినడం వల్ల కూడా శరీరానికి డి విటమిన్ అందుతుంది.
పాలు, పెరుగు, జున్ను, సోయా పాలు, నారింజ పండ్లు, ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి డి విటమిన్ లభిస్తుంది.
తరచూ గోధుమలు, రాగి, బార్లీ లాంటి తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటూ ఉంటే శరీరంలో డి విటమిన్ లోపం తలెత్తదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News