How To Decorate Goddess: వరలక్ష్మీదేవిని ఇలా అలంకరించాలి
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:59 AM
వరలక్ష్మీవ్రతం రోజున మహిళలందరూ లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది పటాన్ని పూజిస్తే మరికొంతమంది మాత్రం అమ్మవారే స్వయంగా వచ్చి కూర్చున్నట్లు ఏర్పాటు చేస్తారు. ఆ దేవికి పట్టుచీర, ఆభరణాలు, పూలు...
వరలక్ష్మీవ్రతం రోజున మహిళలందరూ లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది పటాన్ని పూజిస్తే మరికొంతమంది మాత్రం అమ్మవారే స్వయంగా వచ్చి కూర్చున్నట్లు ఏర్పాటు చేస్తారు. ఆ దేవికి పట్టుచీర, ఆభరణాలు, పూలు అలంకరించి మురిసిపోతుంటారు. పూజ చేసే ముందు అమ్మవారిని అందంగా ఎలా కొలువుదీర్చాలో తెలుసుకుందాం...
బజారు నుంచి అమ్మవారి ముఖం, చేతులు తెచ్చుకోవాలి. లేదంటే ఇంట్లోనే బియ్యప్పిండితో తయారు చేసుకోవచ్చు.
ఇత్తడి లేదా రాగి చెంబును తీసుకోవాలి. దానికి పై భాగంలో ఒక కర్రను తాడుతో కట్టాలి.
అమ్మవారిని ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఒక టేబుల్ లేదా పీట వేసి దాని మీద ఒక బిందె పెట్టాలి. దీనిమీద కర్ర కట్టిన చెంబును ఉంచాలి. కర్ర ముందువైపునకు ఉండేలా చూసుకోవాలి.
జరీ డిజైన్ ఉన్న జాకెట్ గుడ్డను తీసుకుని చిన్న చిన్న కుచ్చిళ్లతో మడతపెట్టాలి. రెండు చివరలా అలాగే మధ్య భాగంలో క్లిప్‌లు పెడితే కుచ్చిళ్లు విడిపోవు. ఇలా తయారుచేసుకున్న కుచ్చిళ్లను చెంబు వెనక నుంచి కర్ర మీదుగా ముందుకు వేలాడదీయాలి. చివరల ఉన్న క్లిప్పులను తీసివేసి కుచ్చిళ్లను గుండ్రంగా వచ్చేలా అందంగా సర్దాలి. ఈ కుచ్చిళ్లను మొదటి చెంబు పై భాగానికి కలుపుతూ లేస్ లేదా దారంతో గట్టిగా కట్టాలి. కర్ర మీద కుచ్చిళ్లను చక్కగా పరచాలి. తరవాత పొడవైన హారం, పెద్ద లాకెట్ ఉన్న నెక్లెస్ అమర్చాలి. నడుము భాగంలో ముత్యాల గొలుసు లేదా చిన్న నెక్లెస్‌ను వడ్డాణంలా పెట్టవచ్చు.
పై చెంబులో కొబ్బరికాయను పెట్టి దాని మీద అమ్మవారి ముఖాన్ని అమర్చాలి. కర్రకు ఇరువైపులా అమ్మవారి చేతులు పెట్టాలి. ఈ రెండు చేతులకూ గాజులు వేయాలి. తరవాత ఒక పెద్ద పూల దండను తీసుకుని తలపై నుంచి భుజాల మీదుగా వేలాడదీయాలి. ఒక కార్డ్ బోర్డును గుండ్రంగా కత్తిరించి దానికి బంగారు రంగులో మెరిసే కాగితాన్ని అంటించాలి. దీన్ని అమ్మవారి తల వెనక జాగ్రత్తగా అమర్చాలి.
కొన్ని కాగితాలను గుండ్రంగా చుట్టి బంతి మాదిరి తయారు చేయాలి. ఇలా రెండు బంతులు తయారు చేసి మొదటి బిందెకు ఇరుపక్కలా కుచ్చిళ్ల కింద అమర్చాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారు పీట మీద కూర్చున్న అనుభూతి కల్గుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో స్తతా చాటిన కూటమి
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
మరిన్నీ తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..