Mixer Jar Cleaning Tips: మిక్సీ గిన్నెలు శుభ్రం ఇలా
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:06 AM
మిక్సీ గిన్నెలకు ఉండే బ్లేడ్స్ కింద రకరకాల ఆహారపదార్థాలు ఇరుక్కుంటూ ఉంటాయి. వీటిని సరిగా శుభ్రం చేయకుండా గిన్నెలను వాడుతూ ఉంటే పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి...
మిక్సీ గిన్నెలకు ఉండే బ్లేడ్స్ కింద రకరకాల ఆహారపదార్థాలు ఇరుక్కుంటూ ఉంటాయి. వీటిని సరిగా శుభ్రం చేయకుండా గిన్నెలను వాడుతూ ఉంటే పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాటిని సులభంగా ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం...
మిక్సీ గిన్నెను ఉపయోగించిన తరువాత అందులో కొన్ని వేడి నీళ్లు, కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. పది నిమిషాల తరువాత చేత్తో రుద్ది కడగాలి. ఆపైన గిన్నెలోని బ్లేడ్స్‌ను జాగ్రత్తగా తీసి వాటితో పాటు గిన్నె మధ్య భాగాన్ని పాత టూత్‌బ్ర్‌ష లేదా స్పాంజ్‌తో రుద్ది కడగాలి. తడి పూర్తిగా ఆరిన తరువాతే గిన్నెకు బ్లేడ్స్‌ను అమర్చాలి.
మిక్సీ గిన్నె మూతకు ఉండే రబ్బర్ గ్యాస్కెట్‌ను బయటకు తీయాలి. బ్రష్ లేదా స్పాంజ్‌ను డిష్ వాషింగ్ లిక్విడ్‌లో ముంచి దానితో గ్యాస్కెట్‌ను, మూత అంచులను రుద్ది కడగాలి. గ్యాస్కెట్ పూర్తిగా ఆరిన తరువాతే మూతకు పెట్టాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్
ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
For More AP News And Telugu News