Share News

How to Brush Your Teeth Properly: ఇలా బ్రష్‌ చేసుకోవాలి

ABN , Publish Date - Oct 12 , 2025 | 06:34 AM

మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే టూత్‌బ్ర్‌షతో దంతాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. సరైన రీతిలో బ్రష్‌ చేసుకోకుంటే దంత సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు....

How to Brush Your Teeth Properly: ఇలా బ్రష్‌ చేసుకోవాలి

మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే టూత్‌బ్ర్‌షతో దంతాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. సరైన రీతిలో బ్రష్‌ చేసుకోకుంటే దంత సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దంతాలు పటిష్టంగా ఉండాలంటే ఏవిధంగా బ్రష్‌ చేసుకోవాలో తెలుసుకుందాం...

  • రోజూ ఉదయం లేవగానే.. రాత్రి పడుకునే ముందు.. తప్పనిసరిగా దంతాలను బ్రష్‌ చేసుకోవాలి. అప్పుడే పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాలు, పళ్లమీద పేరుకున్న బ్యాక్టీరియాలు తొలగిపోయి దంతాలు సురక్షితంగా ఉంటాయి.

  • దంతాలను కనీసం రెండు నిమిషాలపాటు సున్నితంగా వృత్తాకారంలో బ్రష్‌ చేయాలి. దంతాలు, చిగుళ్లు కలిసి ఉన్న ప్రాంతంలో బ్రష్‌ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి.

  • దంతాలను బ్రష్‌ చేయడానికి ఫ్లోరైడ్‌ ఉన్న టూత్‌పేస్టును వాడడం మంచిది. ఇది దంతాల మీద ఉండే ఎనామిల్‌ పొరను కాపాడడంతోపాటు అకాల దంతక్షయాన్ని నివారిస్తుంది. బ్రష్‌ మీద బఠానీ గింజంత పేస్టు మాత్రమే వేసుకుని పళ్లు తోముకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

అలా ఉంటే జగన్ తట్టుకోలేడు... పల్లా షాకింగ్ కామెంట్స్

కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 06:34 AM