Share News

Best Cooking Oil: వంటకు ఏ నూనె వాడాలి

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:22 AM

మనం ఇంట్లో రకరకాల వేపుళ్లతోపాటు పూరీ, వడ, పకోడీ లాంటి అల్పాహార వంటలు చేస్తూ ఉంటాం. వీటికి ఎక్కువగా నూనెను వినియోగించాల్సి ఉంటుంది. బజార్లో దొరికే నూనెలన్నింటినీ వంటకు ఉపయోగించడం...

Best Cooking Oil: వంటకు ఏ నూనె వాడాలి

మనం ఇంట్లో రకరకాల వేపుళ్లతోపాటు పూరీ, వడ, పకోడీ లాంటి అల్పాహార వంటలు చేస్తూ ఉంటాం. వీటికి ఎక్కువగా నూనెను వినియోగించాల్సి ఉంటుంది. బజార్లో దొరికే నూనెలన్నింటినీ వంటకు ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వంటకు ఏ నూనె ఆరోగ్యకరమో తెలుసుకుందాం...

  • సమోసాలు, బజ్జీలు లాంటి డీప్‌ ఫ్రై వంటకాలు చేయడానికి పల్లీల నూనెను ఉపయోగించాలి. ఈ నూనెకు అత్యధిక స్మోక్‌ పాయింట్‌ ఉంటుంది. అంటే ఎక్కువగా వేడిచేసినప్పటికీ ఈ నూనె త్వరగా విచ్ఛిన్నం కాదు. దానిలోని పోషకాలు నశించవు. అలాగే హానికారక పదార్థాలు ఉత్పత్తి కావు. రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌, అవకాడో ఆయిల్‌ కూడా ఈ కోవలోకే వస్తాయి.

  • రోజువారీ చేసే కూరలు, పచ్చళ్ల కోసం ఆవ నూనెను వాడడం మంచిది. ఇది పసుపు, నలుపు రంగుల్లో లభిస్తుంది. రెండూ ఆరోగ్యానికి మంచివే. ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు, న్యూట్రియెంట్స్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. దీన్ని వాడడం వల్ల వంటకాలకు మంచి రుచి, సువాసన చేకూరుతాయి.

  • బజార్లో దొరికే రకరకాల రిఫైన్డ్‌ నూనెలు, పామాయిల్‌ లాంటి వాటిని వంటకు ఉపయోగించకూడదు. వీటిని ఎక్కువగా ప్రాసెస్‌ చేస్తూ ఉంటారు. కాబట్టి వీటివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి పెరుగుతుంది. గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత వ్యాధులు, పలు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 12:22 AM