Share News

Healthy Eating Habits Tips:

ABN , Publish Date - Dec 17 , 2025 | 01:17 AM

భోజనం... ఆకలిని తీరుస్తుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంతటి ప్రాముఖ్యమున్న భోజనాన్ని ఆహార సూత్రాలు పాటించకుండా..

Healthy Eating Habits Tips:

భోజనం... ఆకలిని తీరుస్తుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంతటి ప్రాముఖ్యమున్న భోజనాన్ని ఆహార సూత్రాలు పాటించకుండా పూర్తిచేయడంవల్ల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.

  • భోజనం చేసేటప్పుడు క్రమశిక్షణతో వ్యవహరించాలి. టీవీ, ఫోన్‌, ల్యాప్‌టాప్‌ తదితరాలను చూస్తూ భోజనం చేయకూడదు. ఆహారాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ ఆరగించాలి. పదార్థాలను బాగా నమిలి మింగాలి.

  • ఒకప్పుడు నేలమీద కూర్చుని భోజనం చేసేవారు. తరువాత డైనింగ్‌ టేబుల్స్‌ వచ్చాయి. ప్రస్తుతం నిలబడి తినేస్తున్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. కింద కూర్చుని తినేటప్పుడు ముద్ద నోట్లో పెట్టుకోవాలంటే కొద్దిగా ముందుకు వంగాల్సి వస్తుంది. దీంతో పొట్టమీద ఒత్తిడి పడి తిన్న ఆహారం సరిపోయిందీ లేనిదీ వెంటనే తెలుస్తుంది. అదే నిలబడి తింటున్నప్పుడు కావాల్సినదాని కన్నా ఎక్కువగా తినడం అందరికీ అనుభవమే. ఇలా పొట్టను పూర్తిగా నింపడంవల్ల అసిడిటీ, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఎలాంటి ఆహారాన్ని ఎంత మోతాదులో తింటున్నామో గమనించుకుంటూ ఉండాలి. మితంగా, పోషకాహారం తీసుకోవాలి.

  • పొట్టలో ముప్పావు వంతు నిండే వరకు మాత్రమే తినాలి. మిగిలిన భాగాన్ని ఖాళీగా ఉంచాలి. అప్పుడే జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది.

  • భోజనం మధ్యలో లేదా పూర్తయిన తరువాత ఎక్కువ నీళ్లు తాగకూడదు. అవసరం మేరకు కొద్దిగా తాగాలి.

  • భోజనం చేసిన తరువాత కనీసం నాలుగు గంటల వరకు ఏ ఇతర ఆహార పదార్థాలు తీసుకోకూడదు.

  • రాత్రి భోజనం మితంగా, తేలికగా జీర్ణమయ్యేలా ఉండాలి. వీలైనంత త్వరగా ముగించాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!

తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్

For More AP News And Telugu News

Updated Date - Dec 17 , 2025 | 01:17 AM