Share News

Ekavimsathi Patra: ఏకవింశతి పత్రాలు ఆరోగ్య సూత్రాలు

ABN , Publish Date - Aug 27 , 2025 | 04:58 AM

వినాయక చవితి రోజున 21 ఆకులతో గణనాథుణ్ణి పూజించడం సంప్రదాయం. ‘ఏకవింశతి పత్రాలు’గా వ్యవహరించే ఈ ఆకులన్నీ ఆరోగ్యకారకాలని ఆయుర్వేదం చెబుతోంది...

Ekavimsathi Patra: ఏకవింశతి పత్రాలు ఆరోగ్య సూత్రాలు

వినాయక చవితి రోజున 21 ఆకులతో గణనాథుణ్ణి పూజించడం సంప్రదాయం. ‘ఏకవింశతి పత్రాలు’గా వ్యవహరించే ఈ ఆకులన్నీ ఆరోగ్యకారకాలని ఆయుర్వేదం చెబుతోంది.

మాచీ పత్రం (మాచి పత్రి)

ఆర్త్‌మీసియా వల్గారిస్‌- మంచి సువాసన గల పత్రి. తలనొప్పులు, కంటి దోషాలు తగ్గుతాయి.

బృహతీ పత్రం (వాకుడు)

దగ్గు, ఉబ్బసం, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది.

బిల్వ పత్రం(మారేడు)

ఈ వృక్షం బహు ప్రయోజనకారి. ఆకు పసరు పలు చర్మ దోషాలను నివారిస్తుంది.

దుర్వాయుగ్మం (గరిక)

రక్త పైత్యానికి, మూత్ర సంబంధిత సమస్యలకు నివారకంగా పనిచేస్తుంది.

దత్తూర పత్రం (ఉమ్మెత్త)

ఆస్తమా, ఇతర దగ్గులకు, కీళ్లవాతాలకు మంచి మందు. ఆకురసం తేలు, జెర్రి, ఎలుక కాట్లకు విషహారిణిగా పనిచేస్తుంది.

బదరీ పత్రం (రేగు)

అజీర్తి, రక్త దోషాలను

నివారిస్తుంది. వీర్యవృద్ధికి తోడ్పడుతుంది.

అపామార్గ పత్రం (ఉత్తరేణి)

గాయాలను మాన్పడంలో, ఇతర చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.

తులసీ పత్రం (తులసి)

దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధులలను నివారిస్తుంది. క్రిములను నశింపజేస్తుంది. మొక్కలను చీడపీడల నుంచి కాపాడుతుంది.

చూత పత్రం (మామిడి ఆకు)

మామిడి భూమండలంలో అతి పురాతన మైన పండ్ల మొక్కల్లో ప్రధానమైనది. పాదాల బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కరవీర పత్రం (గన్నేరు)

తలలో చుండ్రును తగ్గిస్తుంది. ఈ మొక్క విషతుల్యం కాబట్టి తగిన జాగ్రత్తలు

తీసుకొని వాడాలి.

విష్ణుక్రాంత పత్రం (విష్ణుకాంత)

దీర్ఘకాలిక దగ్గును, కఫవాతాలను, జ్వరాలను నివారిస్తుంది.

దాడిమీ పత్రం (దానిమ్మ)

శరీరంలో త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను

హరింపజేస్తుంది.

దేవదారు పత్రం (దేవదారు)

దేవదారు తైలం చర్మవ్యాధులు, గొంతు సమస్యలు, పేగుల్లో పుండ్ల నివారణకు, కండరాల బలోపేతానికి ఉపయుక్తంగా ఉంటుంది.


మరువక పత్రం (మరువం)

నరాల ఉతే్త్ప్రరణకు, చెవిపోటు,

నొప్పులకు ఔషధంగా ఉపయోగ

పడుతుంది.

సింధువార పత్రం (వావిలి)

వాతం, శరీరం, తలమాడు నొప్పిలను తగ్గిస్తుంది. పంటి చిగుళ్లు, కీళ్ల బాధలను నివారిస్తుంది.

జాజీ పత్రం (జాజి ఆకు)

ఈ ఆకులు శరీరానికి వేడిని, శక్తిని అందించి, వాపుల్ని, నొప్పిని తగ్గిస్తాయి. రక్త శుద్ధి చేస్తాయి.

గండకీ పత్రం (దేవకాంచనం)

కడుపులో నులిపురుగులను

హరిస్తుంది.

శమీ పత్రం (జమ్మి ఆకు)

ఈ ఆకురసం మాడుకు చల్లదనాన్నిచ్చి, జుట్టు నిగనిగలాడేందుకు ఉపకరిస్తుంది. ఈ చెట్టు పైనుంచి వీచే గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

అశ్వత్థ పత్రం (రావి ఆకు)

శరీరంలో విషాల విరుగుడుకు, క్రిమిదోషాలను నివారించేందుకు వినియోగిస్తారు.

అర్జున పత్రం (తెల్ల మద్ది)

దీని బెరడు కషాయం గుండె ఆరోగ్యంగా,

పదిలంగా ఉండడానికి దోహదం చేస్తుంది.

అర్క పత్రం (తెల్ల జిల్లేడు)

తెల్లజిల్లేడును సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. దీనిలోని ఔషధగుణాలు

శరీరాన్ని కాంతిమంతం చేస్తాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు

ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 27 , 2025 | 04:58 AM