Share News

Water Chestnut Benefits: సర్వ రోగ నివారిణి

ABN , Publish Date - Nov 27 , 2025 | 02:29 AM

శీతాకాలంలో విరివిగా లభించే సింగాడా దుంపలు... చూడడానికి నల్లని బొగ్గుల్లా కనిపిస్తాయి. లోపల మాత్రం తెల్లగా ఉంటుంది. వీటిలో చాలా పోషకాలు ఉంటాయనీ, వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల

Water Chestnut Benefits: సర్వ రోగ నివారిణి

శీతాకాలంలో విరివిగా లభించే సింగాడా దుంపలు... చూడడానికి నల్లని బొగ్గుల్లా కనిపిస్తాయి. లోపల మాత్రం తెల్లగా ఉంటుంది. వీటిలో చాలా పోషకాలు ఉంటాయనీ, వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనీ నిపుణులు చెబుతున్నారు.

  • సింగాడాలు తీపి, వగరు కలగలిసిన రుచిలో క్రంచీగా ఉంటాయి. వీటిని ఉడికించుకుని లేదా కాల్చుకుని తినవచ్చు. సలాడ్స్‌, సూప్స్‌, శాండ్‌విచ్‌లలో వినియోగించుకోవచ్చు. వీటిని ఎండబెట్టి పిండి చేసి దానితో రొట్టెలు, లడ్డూలు, కడి లాంటి కూరలు తయారు చేసుకోవచ్చు. సింగాడా పిండిని పూజలు, ఉపవాసాలప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

  • సింగాడాలో పీచుపదార్థాలు అధికం. ఇవి జీర్ణక్రియను వేగవంతం చేసి చలికాలంలో ఎక్కువగా ఏర్పడే మలబద్దకం సమస్యను నివారిస్తాయి.

  • వీటిలోని కాల్షియం, పొటాషియం, మాంగనీస్‌, జింక్‌, కాపర్‌ లాంటి మినరల్స్‌.. ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి. శరీరంలో రక్తప్రసరణ వేగాన్ని నియంత్రించి గుండె ఆరోగ్యంగా పనిచేసేందుకు తోడ్పడతాయి. మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయి.

  • సింగాడాలో అరుదైన లారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది చర్మసౌంర్యాన్ని కాపాడడంతోపాటు శిరోజాలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. చర్మానికి తగినంత తేమను అందిస్తుంది. సింగాడాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం పొడిబారడం, చుండ్రు లాంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో పేరుకున్న టాక్సిన్లు బయటికి వెళ్లిపోతాయి. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

  • సింగాడాలో బి, సి, ఇ, కె విటమిన్లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీరానికి పోషణను అందిస్తాయి. కొవ్వులు, కేలరీలు నామ మాత్రంగా ఉంటాయి. దీని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కూడా చాలా తక్కువ. మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వర్షాలు..

బీసీలకు మోసం జరుగుతుంటే.. బీఆర్ఎస్ నుంచి నో రియాక్షన్: కవిత

For More AP News And Telugu News

Updated Date - Nov 27 , 2025 | 02:29 AM