Share News

A Nutrient Packed Superfood: తేగలు తిందాం

ABN , Publish Date - Dec 25 , 2025 | 02:08 AM

చలికాలంలో విరివిగా లభించే తేగల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. తేగలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...

A Nutrient Packed Superfood: తేగలు తిందాం

చలికాలంలో విరివిగా లభించే తేగల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. తేగలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...

  • తేగల్లో పీచుపదార్థాలు ఎక్కువ. ఇవి శీతాకాలంలో మందగించే జీర్ణ శక్తిని పెంచుతాయి. మలబద్దకాన్ని నివారిస్తాయి. పేగులను శుభ్రం చేస్తాయి. పైల్స్‌ సమస్యతో ఇబ్బందిపడే వారికి ఇవి ఔషధంలా పనిచేస్తాయి.

  • తేగల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ లాంటి పోషకాలతోపాటు బి, సి విటమిన్లు; యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించి క్యాన్సర్‌ కారకాల నుంచి కాపాడతాయి.

  • తేగలు తింటుంటే దంతాల మీద పేరుకున్న గార తొలగిపోతుంది. పెద్దల్లో ఎముకలు పెళుసుబారకుండా ఉంటాయి.

  • తేగలవల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌ అందుతుంది. దీంతో కండరాలు బలోపేతమవుతాయి. శరీరంలో హార్మోన్లు, ఎంజైమ్‌లు తగు పాళ్లలో ఉత్పత్తి అవుతాయి. తక్షణ శక్తి లభిస్తుంది.

  • తేగల్లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించి రక్తపోటును తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి...

వీరన్న హత్య కేసులో వీడిన మిస్టరీ... అసలు నిజం ఇదే

తిప్పలు పెడితే రాసుకోండి.. మిత్తీతో సహా తీర్చేద్దాం: హరీష్ రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 02:08 AM