Share News

కొలీగ్స్‌తో కలిసి టూర్‌కు...

ABN , Publish Date - Jun 22 , 2025 | 12:45 PM

టూర్‌ అనగానే కుటుంబం, బంధువులు లేదా స్నేహితులు గుర్తుకువస్తారు ఎవరికైనా. ఒక్కోసారి అపార్ట్‌మెంట్‌వాసులు, వీధిలోని వారంతా కలిసి పుణ్యక్షేత్రాలకు టూర్‌ వెళ్తుంటారు. ఆఫీసులో పనిచేసేవారు... అంటే కొలీగ్స్‌తో కూడా అప్పుడప్పుడు టూర్‌ ప్లాన్‌ చేయొచ్చు.

కొలీగ్స్‌తో కలిసి టూర్‌కు...

టూర్‌ అనగానే కుటుంబం, బంధువులు లేదా స్నేహితులు గుర్తుకువస్తారు ఎవరికైనా. ఒక్కోసారి అపార్ట్‌మెంట్‌వాసులు, వీధిలోని వారంతా కలిసి పుణ్యక్షేత్రాలకు టూర్‌ వెళ్తుంటారు. ఆఫీసులో పనిచేసేవారు... అంటే కొలీగ్స్‌తో కూడా అప్పుడప్పుడు టూర్‌ ప్లాన్‌ చేయొచ్చు. ఈ సరికొత్త ట్రెండ్‌ను ‘ఫ్రొలీగ్స్‌’ అంటున్నారు. 2025లో ఈ ట్రెండ్‌ ఊపందుకుంటోందని చెబుతున్నారు టూర్‌ ఆపరేటర్లు. ఆ విశేషాలే ఇవి...

సాధారణంగా టూర్‌ అనగానే ఏడాదికి రెండుసార్లు... అంటే వేసవి సెలవులకో, క్రిస్‌మస్‌ సెలవులకో అనుకుంటారంతా. ఇప్పుడా భావన పోయింది. సమయం చిక్కితే చాలు టూర్లు వేస్తున్నారు. సమయాన్ని బట్టి లాంగ్‌, షార్ట్‌ టూర్లకు సై అంటున్నారు.

రిమోట్‌ వర్క్‌ సంస్కృతి బాగా పెరగడంతో ఆఫీసులో స్నేహితుల్లా ఉండే కొలీగ్స్‌తో ఉల్లాసం కోసం కలిసి ట్రిప్స్‌ వేస్తున్నారు. హిల్టన్‌ రిపోర్టు ప్రకారం చిన్న చిన్న మీటింగ్‌లు, ఆఫ్‌సైట్‌ టీమ్‌ కలయిక, ఇన్సెంటివ్‌ ట్రావెల్‌ టూర్‌కు ‘ఫ్రొలీగ్స్‌’ ఇష్టపడుతున్నారు.


ఇటీవల కాలంలో కొలీగ్స్‌తో కూడా టూర్లకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రముఖ ట్రావెల్‌ ఏజెన్సీ థామస్‌కుక్‌ ‘ఇండియా హాలీడే రిపోర్ట్‌’ ప్రకారం 28 శాతం మంది ‘ఫ్రొలీగ్స్‌’కు ఓకే అంటున్నారు. అంటే ఆఫీసులో మీ చాయ్‌ సహద్యోగి... మీ ట్రెక్కింగ్‌ మిత్రుడు కావొచ్చు.

మిగతా అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం చాలామంది ఉద్యోగస్తులు సరికొత్త ప్రయాణ అనుభవం కోసం ‘ఫ్రొలీగ్స్‌’ టూర్‌కు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.

ప్రసిద్ధ గాయకుల (ఉదాహరణకు దిల్జీత్‌ దోసాంజ్‌, కోల్డ్‌ప్లే) కాన్సర్ట్‌లు వివిధ నగరాల్లో అవుతున్నాయి కాబట్టి, వాటికోసం సహోద్యోగులతో కలిసి వెళ్తున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా ఇలాంటి వేడుకలకు వెళ్లేవారి సంఖ్య 20 శాతం పెరిగింది.


book9.2.jpg

ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్‌ ఊపందుకుంటోంది. అమెరికా, చైనా, జపాన్‌, యు.కెలలో ఇప్పటికే 29 శాతం ‘ఫ్రొలీగ్స్‌’ టూర్లు పెరిగాయి. ఈ సంఖ్య ఈ ఏడాది మరింత పెరిగే అవకాశముందని టూర్‌ ఆపరేటర్లు లెక్కలు వేస్తున్నారు.

‘ఫ్రొలీగ్స్‌’ టూర్‌లకు యూరోప్‌తో పాటు మన దేశంలో కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లు ముందు వరుసలో ఉన్నాయి.

మనదేశంలో ఇప్పటిదాకా 65 శాతం మంది కుటుంబసమేతంగా, 60 శాతం మంది పార్ట్‌నర్‌తో, 10 శాతం మంది సోలోగా టూర్‌లు వేసేందుకు ఇష్టపడుతున్నట్లు రిపోర్ట్‌లు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2025 | 12:45 PM