Fabulous Foliage Fashion: కనువిందైన ఫోలియేజ్
ABN , Publish Date - Nov 05 , 2025 | 02:23 AM
రంగురంగుల పూలను ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? అలాంటి ఆకట్టుకునే అందాలను ఫ్యాషన్ ప్రపంచం కూడా ఆదరిస్తోంది. కాబట్టే వినూత్నమైన ‘ఫోలియేజ్’ డ్రస్సులు...
ఫ్యాషన్
రంగురంగుల పూలను ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? అలాంటి ఆకట్టుకునే అందాలను ఫ్యాషన్ ప్రపంచం కూడా ఆదరిస్తోంది. కాబట్టే వినూత్నమైన ‘ఫోలియేజ్’ డ్రస్సులు రూపొందుతున్నాయి.
వాటి మీద ఓ లుక్కేద్దాం!
ఆధునికత ఉట్టిపడే దుస్తుల ఫ్యాషన్‌గా తాజాగా ఫోలియేజ్ స్టైల్ సర్వత్రా ఆదరణ పొందుతోంది. సుతిమెత్తని మెటీరియల్స్‌తో రూపొందే ఈ తరహా దుస్తులు ఈవినింగ్ పార్టీలు, సరదా షికార్లు, ప్రయాణాలు... ఇలా అన్ని సందర్భాలకూ అనువుగా ఉంటాయి.
ఆకులు రాలేలా...
ఆటమ్ డ్రస్ సుతిమెత్తని మెటీరియల్‌తో తయారవుతుంది. ఈవినింగ్ పార్టీలు, వేడుకల్లో అందరి దృష్టినీ ఆకర్షించడం కోసం ఈ డ్రస్‌ను ఎంచుకోవచ్చు. హూందాగా, ఫ్యాషన్‌గా కనిపించేలా చేసే ఆటమ్ ఫోలియేజ్ ఫాల్ డ్రస్‌ను తేలికపాటి ప్లాటినం లేదా యాంటిక్ జ్యువెలరీ, హైహీల్స్‌తో మ్యాచ్ చేయాలి.
లినెన్ అందాల్లో...
బోహో స్టైల్‌లో మెరిసిపోవడం కోసం లినెన్ మెటీరియల్ డ్రస్ ఎంచుకోవాలి. మోడర్న్ లుక్ కోసం కాలర్, బెల్ట్ జోడించాలి. పెద్ద బకిల్ బెల్టులు ఈ దుస్తుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. యాంకిల్ బూట్స్ అదనపు ఆకర్షణను తెచ్చి పెడతాయి.
కౌటౌ డ్రస్
ఆర్గానిక్ కాటన్ జెర్సీతో రూపొందే ఈ డ్రస్సులు అద్భుతమైన డిజైన్లలో రూపొందుతూ ఉంటాయి. దట్టమైన ఆకులు, లతలు, కొమ్మలు ఈ డిజైన్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ప్రకృతిని మరిపించే ఈ డిజైన్ దుస్తుల రంగుల్లో వైవిధ్యం కూడా కనబడుతుంది.
ఇవి కూడా చదవండి...
వ్యవసాయ రంగం అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి మూలం: కిషన్‌రెడ్డి
ఒక్క ఛాన్స్ అని.. తెలంగాణని దివాళా తీయించారు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News