Share News

Bhagavad Gita: వ్యక్తావ్యక్తాలు

ABN , Publish Date - Aug 22 , 2025 | 01:39 AM

ప్రాథమిక విద్యను అభ్యసించేవారి నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివేవారి వరకూ ఆత్మజ్ఞానం కోసం అధ్యయనం చేయాల్సిన శాశ్వతమైన పాఠ్యపుస్తకం... భగవద్గీత. దాన్ని మొదటిసారి చదివినప్పుడు చాలా తక్కువ అంశాలు అర్థమవుతాయి. కానీ...

Bhagavad Gita: వ్యక్తావ్యక్తాలు

గీతాసారం

ప్రాథమిక విద్యను అభ్యసించేవారి నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివేవారి వరకూ ఆత్మజ్ఞానం కోసం అధ్యయనం చేయాల్సిన శాశ్వతమైన పాఠ్యపుస్తకం... భగవద్గీత. దాన్ని మొదటిసారి చదివినప్పుడు చాలా తక్కువ అంశాలు అర్థమవుతాయి. కానీ ‘వ్యక్తం’, ‘అవ్యక్తం’ అనే దృష్టి కోణం నుంచి సులభంగా అర్థం చేసుకోవచ్చు.

మన ఇంద్రియాల పరిధిలోకి వచ్చేవి వ్యక్తమైనవి, ఇంద్రియాలకు అతీతమైనవి అవ్యక్తమైనవి. ‘బిగ్‌ బ్యాంగ్‌’ (బృహత్‌ ప్రళయం) మొదలు నక్షత్రాల పుట్టుక, ఆ నక్షత్రాల్లోని కీలకమైన భాగాల్లో అత్యున్నత రసాయనిక మూలకాలు కలిగిన అణువుల నిర్మాణం, నక్షత్రాలు విచ్ఛిత్తికి గురైనప్పుడు ఆ మూలకాలు చెల్లాచెదురు అయ్యే తీరు, గ్రహమండలం ఏర్పాటు, భూమి మీద బౌద్ధిక జీవితం ఆరంభం లాంటి అనేక అంశాలను వ్యక్తమయ్యే వాటి కథలు వివరిస్తాయి. ఈ వ్యక్తమైన జీవరూపాలు, గ్రహాలు, నక్షత్రాలు, చివరకు ఈ విశ్వం కూడా ఒక నిర్దిష్టమైన కాలపరిమితిని కలిగి ఉన్నాయనేది శాస్త్రీయ సమాజం అంగీకరించిన సంగతే. అయితే అంచనా వేసిన కాల పరిమితుల్లో తేడా రావచ్చు. వ్యక్తమయ్యే వాటి దృక్కోణంలో మనం పుట్టినప్పటి నుంచి మరణించేవరకూ మనుగడ కలిగి ఉంటామనేది వాస్తవం.

అవ్యక్తమైన వాటి దృక్కోణంలో చూసినట్టయితే... భగవద్గీత చెప్పిన ప్రకారం,... మనం పుట్టుకకు ముందు, మరణం తరువాత కూడా మనుగడ కలిగి ఉంటాం. ఈ స్పష్టతను దృష్టిలో ఉంచుకున్నట్టయితే... ‘భగవద్గీత’లో వివరించినట్టు మనం వ్యక్తం, అవ్యక్తాల అనుబంధాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. అవ్యక్తమైన లక్ష్యాన్ని (మోక్షాన్ని) గుర్తించి, దాన్ని పొందగలుగుతాం. కానీ అహంకారం ఈ మార్గంలో ప్రయాణానికి అవరోధంగా ఉంటుంది. అయితే బయటి ప్రపంచంలోని సుఖదుఃఖాలకు అతీతంగా, మనలో నిండి ఉన్న ఆనందమే.. అవ్యక్తమైన అంతరాత్మ వైపు సాగే ప్రయాణంలో మనం సాధించిన పురోగతికి సూచిక.

కె.శివప్రసాద్‌

ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Read Latest AP News and National News

Updated Date - Aug 22 , 2025 | 01:39 AM