సాయంకాలం నడక మంచిది!
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:03 AM
వేసవికాలంలో సాయంత్రం పూట వాకింగ్‌కు వెళ్లడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

వేసవికాలంలో సాయంత్రం పూట వాకింగ్‌కు వెళ్లడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
సాయంత్రంపూట అహ్లాదకరమైన వాతావరణంలో నడవడం వల్ల మెదడులో సెరటోనిన్ అనే రసాయనం విడుదలవుతుంది. దీంతో రాత్రిపూట నిద్ర బాగా పడుతుంది.
ఉదయం నుంచి సాయంత్ర వరకూ రకరకాల పనులతో శారీరకంగా అలసట, మానసికంగా ఒత్తిడి అధికంగా ఏర్పడతూ ఉంటాయి. ప్రతిరోజూ సాయంత్రం కనీసం అరగంటసేపు నడిస్తే బడలిక తీరి మెదడు ఉత్సాహంగా పనిచేస్తుంది.
సాయంత్రం వేళ వేగంగా నడవడం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ లభిస్తుంది. ఊపిరితిత్తులు, గుండె కండరాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. మానసిక ఉల్లాసం లభిస్తుంది.
మధుమేహంతో బాధపడేవారు సాయంకాలం నడవడం అలవాటు చేసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు సమస్య రాదు. శరీరంలోని కొవ్వులు తొందరగా కరుగుతాయి.
సాయంకాలపు నడక వల్ల శరీరంలోని కండరాలు బలపడతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతిగా తినాలనే కోరిక తగ్గి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. జీవక్రియలు వేగవంతమవుతాయి. జీర్ణాశయ సమస్యలు తీరుతాయి. రాత్రి భోజనం తరవాత కొద్దిసేపు నడవడం వల్ల కడుపులో ఆమ్లత్వం, పొట్టలో ఉబ్బరం, అజీర్తి లాంటివి తగ్గుతాయి.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ
Also Read: నా చేతిలో కత్తి పెట్టి..
Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..
For AndhraPradesh News And Telugu News