Share News

Essential Tips for Strong and Thick Hair: ఒత్తయిన శిరోజాల కోసం.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

ABN , Publish Date - Oct 12 , 2025 | 06:36 AM

కొంతమందికి విపరీతంగా జుట్టు రాలడాన్ని చూస్తూ ఉంటాం. అందుకు పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళనలు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు...

Essential Tips for Strong and Thick Hair: ఒత్తయిన శిరోజాల కోసం.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

కొంతమందికి విపరీతంగా జుట్టు రాలడాన్ని చూస్తూ ఉంటాం. అందుకు పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళనలు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆలాకాకుండా కుదుళ్లు బలోపేతమై శిరోజాలు ఒత్తుగా పెరగడానికి పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం...

  • ఒక గిన్నెలో అర కప్పు మెంతులు వేసి నిండా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మెంతులను మెత్తగా గ్రైండ్‌ చేసి ఆ పేస్టుని తలకు పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి ఆపై తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే.. శిరోజాలు రాలడం తగ్గి నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.

  • ఎర్ర ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించి పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా రెండు రోజులకోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

  • రాత్రి పడుకునే ముందు తలకు ఉసిరి నూనె లేదా కొబ్బరినూనెతో మర్ధన చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేస్తే శిరోజాల కుదుళ్లు బలపడతాయి.

  • రెండు రోజులకోసారి తలకి కలబంద గుజ్జు పట్టించి పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తుంటే జుట్టు నల్లగా పొడవుగా పెరుగుతుంది. తగినంత తేమ అంది శిరోజాలు చక్కగా మెరుస్తుంటాయి.

  • కోడిగుడ్డులోని తెల్ల సొనకు కొద్దిగా పెరుగు కలిపి తలకు పట్టించి పది నిమిషాల తరువాత తలస్నానం చేసినా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

  • ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌, ఐరన్‌ ఎక్కువగా ఉండే పోషకాహారాన్ని తరచూ తీసుకుంటూ ఉంటే శిరోజాలు బలంగా పెరుగుతాయి. గ్రీన్‌ టీని తాగినా, తలకు పట్టించినా మంచి ఫలితం కనిపిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అలా ఉంటే జగన్ తట్టుకోలేడు... పల్లా షాకింగ్ కామెంట్స్

కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 07:11 AM