Essential Tips for Proper Digestion: పదార్థాలు పసందుగా
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:29 AM
పదార్థాల్లోని పోషకాలను మన శరీరం సంపూర్ణంగా వినియోగించుకోవాలన్నా, జీర్ణ సమస్యలు వేధించకుండా ఉండాలన్నా కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే....
పోషకాలు
పదార్థాల్లోని పోషకాలను మన శరీరం సంపూర్ణంగా వినియోగించుకోవాలన్నా, జీర్ణ సమస్యలు వేధించకుండా ఉండాలన్నా కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే....
పప్పులు: వండుకోడానికి ఒక రాత్రి ముందు కందిపప్పు, పెసరపప్పు మొదలైన పప్పులను నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని యాంటీ న్యూట్రియంట్లు వదిలిపోవడమే కాకుండా, ప్రొటీన్ శోషణ పెరుగుతుంది. ఇలా వండుకున్న పప్పులతో కడుపుబ్బరం సమస్య వేధించకుండా ఉంటుంది
సుగంధ ద్రవ్యాలు: నూనె లేకుండా వేయించి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకోవడం వల్ల వాటి సామర్థ్యం పెరుగుతుంది. తేలికగా జీర్ణమవుతాయి
సూప్: వీటికి యాపిల్, పైనాపిల్ మొదలైన పండ్లను జోడించకూడదు. వీటితో కడుపుబ్బరం వేధిస్తుంది. జీర్ణాగ్ని చల్లబడకుండా ఉండడం కోసం సూప్స్‌ను వేడిగానే తీసుకోవాలి
పాలు: తాగే మందు తప్పనిసరిగా మరిగించాలి. పచ్చి పాలు జీర్ణం కావు
పండ్లు: భోజనంతో కలిపి కాకుండా పండ్లను విడిగా తినాలి. ఇతర పదార్థాలతో కలిపి తినడం వల్ల అసిడిటీ, పులిసే సమస్యలు వేధిస్తాయి
ఇవి కూడా చదవండి..
ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News