Essential nutrients : పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే..!
ABN , Publish Date - Jan 27 , 2025 | 05:26 AM
పెరిగే పిల్లలకు పోషకాహారం తప్పనిసరి. శారీరక ఎదుగుదలతోపాటు పిల్లల మానసిక వికాసానికి నిపుణులు సూచిస్తున్న ఆహార పదార్థాలు ఇవే...
పెరిగే పిల్లలకు పోషకాహారం తప్పనిసరి. శారీరక ఎదుగుదలతోపాటు పిల్లల మానసిక వికాసానికి నిపుణులు సూచిస్తున్న ఆహార పదార్థాలు ఇవే...
పిల్లలు బడికి వెళ్లే ముందు ఉడికించిన గుడ్డు తినిపించాలి. కేరట్, బీట్‌రూట్ ముక్కలు జత చేసిన ఆమ్లెట్ కూడా మంచిదే. దీనివల్ల శరీర పెరుగుదలకు కావాల్సిన ప్రోటీన్ అందుతుంది.
ఓట్స్‌ను ఉడికించి దానికి దానిమ్మ గింజలు, స్ట్రాబెరీ ముక్కలు చేర్చి తినిపించవచ్చు. వీటివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.
ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో బాదం, కాజు, పిస్తా, వాల్‌నట్, డ్రై అంజూర్, ఖర్జూరం లాంటివి తినిపించడం వల్ల పిల్లలు పొడవుగా పెరుగుతారు. రోగనిరోధక శక్తి కూడా లభిస్తుంది.
బడి నుంచి ఇంటికి రాగానే రాగి జావ పెట్టడం మంచిది. దీనివల్ల నీరసం, అలసట తగ్గి పిల్లలు ఉత్సాహంగా ఉంటారు.
ఫ ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలో ఆకు కూరలు, పప్పు దినుసులు, నెయ్యి చేర్చి తినిపించాలి. వీటివల్ల కాల్షియం, ఇతర పోషకాలు అంది ఆరోగ్యంగా పెరుగుతారు.
ఇడ్లీ, దోశ, శాండ్‌విచ్, పన్నీర్‌తో తయారుచేసిన వంటకాలు తినిపించడంవల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు పాలు తాగించాలి. భోజనంలో మజ్జిగను చేర్చాలి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూరగాయయలు ఉడికించి తయారుచేసిన సూప్ తాగించవచ్చు. వీటివల్ల పిల్లల శరీరంలో నిర్జలీకరణ ఏర్పడదు.
కాలానుగుణంగా లభించే యాపిల్, అరటి, జామ, ద్రాక్ష, మామిడి పండ్లను పిల్లలచేత తినిపించాలి. అప్పుడే వారికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు అందుతాయి. తరచూ పల్లీలు, బెల్లం, నువ్వులు పెడితే రక్తహీనత లాంటి సమస్యలు రావు.
చిక్కుళ్లు, బఠానీలు, మొలకలను తినడం అలవాటు చేయాలి. బ్రకోలీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాటా, దోస, కీర లాంటి కూరగాయలను ఆహారంలో చేర్చి పిల్లలకు పెట్టడం మంచిది.
ఇవి కూడా చదవండి