Share News

Engilipoola Bathukamma: పూల జాతర మొదలైంది

ABN , Publish Date - Sep 21 , 2025 | 04:44 AM

తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దంపట్టే, ప్రకృతితో మమేకమయ్యే సంబరం... బతుకమ్మ పండుగ. ఈ వేడుకలు ప్రతి యేటా భాద్రపద అమావాస్య... అంటే మహాలయ అమావాస్య (పెత్రామాస) రోజున...

Engilipoola Bathukamma: పూల జాతర మొదలైంది

వేడుక

నేడు ఎంగిలిపూల బతుకమ్మ

తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దంపట్టే, ప్రకృతితో మమేకమయ్యే సంబరం... బతుకమ్మ పండుగ. ఈ వేడుకలు ప్రతి యేటా భాద్రపద అమావాస్య... అంటే మహాలయ అమావాస్య (పెత్రామాస) రోజున ప్రారంభమవుతాయి. ఈ సంబరాల్లో బతుకమ్మలను రోజుకో పేరుతో కొలుస్తారు. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ అలంకరణ కోసం ముందురోజే రకరకాల పువ్వులు కోసుకొని తీసుకొచ్చి, నీళ్ళలో వేస్తారు. మర్నాడు వాటితో బతుకమ్మను అలంకరిస్తారు. అందుకే ‘ఎంగిలిపూల బతుకమ్మ’ అంటారు. పూలతో చక్కగా బతుకమ్మను పేర్చి, తమలపాకులు ఉంచి, పసుపుతో తయారు చేసిన బతుకమ్మను దానిపై పెట్టి పూజలు చేస్తారు. ఈ తొమ్మిది రోజులూ రకరకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు.

ఈ రోజు నైవేద్యం:

నువ్వులు, నూకలు, బియ్యం పిండి, బెల్లం

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు

మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 04:44 AM