Intestinal Worms in Children: నులిపురుగులకు చెక్ ఇలా
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:44 AM
సాధారణంగా పిల్లలకు కడుపులో నులిపురుగులు చేరుతూ ఉంటాయి. దీంతో పిల్లలు నీరశించిపోతూ ఉంటారు. వారి ఎదుగుదల ఆగిపోతుంది. అనారోగ్యానికి గురవుతుంటారు కూడా...
సాధారణంగా పిల్లలకు కడుపులో నులిపురుగులు చేరుతూ ఉంటాయి. దీంతో పిల్లలు నీరశించిపోతూ ఉంటారు. వారి ఎదుగుదల ఆగిపోతుంది. అనారోగ్యానికి గురవుతుంటారు కూడా. అలాకాకుండా చిన్న చిట్కాలతో ఈ నులిపురుగుల సమస్యను వదిలించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు...
రోజూ రెండు లేదా మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బలను పిల్లలతో తినిపిస్తూ ఉంటే సమస్య తీరుతుంది. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు... కడుపులోని పురుగులను నాశనం చేస్తాయి.
గుమ్మడి గింజల్లో కుకుర్‌బిటాసిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణాశయంలో చేరే పురుగులను తొలగించడానికి దోహదం చేస్తుంది. రోజూ పిల్లలు తినే ఆహారంలో గుమ్మడి గింజలు చేర్చడం మంచిది.
నులిపురుగులను తొలగించడంలో బొప్పాయి పండు ఔషధంలా పనిచేస్తుంది. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్.. పొట్టతోపాటు జీర్ణవ్యవస్థను పూర్తిగా శుభ్రం చేస్తుంది. బాగా పండిన బొప్పాయి పండు ముక్కలను తరచూ పిల్లలతో తినిపిస్తుంటే ప్రయోజనం కనిపిస్తుంది.
వాల్‌నట్స్‌లో యాంటీ పారాసైటిక్ గుణాలు ఉంటాయి. రాత్రిపూట వాల్‌నట్స్‌ను నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పిల్లలతో తినిపిస్తూ ఉంటే నాలుగు రోజుల్లో సమస్య తీరుతుంది.
రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలతో ఒక చెంచా అల్లం రసం తాగించినా ఫలితం ఉంటుంది.
పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలతో తినిపిస్తుంటే కడుపులోని నులిపురుగులు విసర్జితమవుతాయి. తృణధాన్యాలు, ఆకు కూరలు, కూరగాయలు, బీన్స్, కేరట్, బీట్‌రూట్, పసుపు, బెల్లం, కొబ్బరి, పెరుగును ఆహారంలో చేర్చడం వల్ల నులిపురుగుల సమస్య వెంటనే తీరుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News