Share News

Head Lice Remedies: ఇవి రాస్తే పేలు రాలిపోతాయి

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:09 AM

ఒక్కోసారి తలలో పేలు పడుతుంటాయి. దీంతో తలలో దురద, జుట్టురాలడం, నిద్రలేమి, రక్తహీనత లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు తలకు కొన్ని రకాల నూనెలను...

Head Lice Remedies: ఇవి రాస్తే పేలు రాలిపోతాయి

ఒక్కోసారి తలలో పేలు పడుతుంటాయి. దీంతో తలలో దురద, జుట్టురాలడం, నిద్రలేమి, రక్తహీనత లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు తలకు కొన్ని రకాల నూనెలను పట్టించి పేల సమస్యను నివారించుకోవచ్చు.

  • చిన్న గిన్నెలో ఐదు చెంచాల ఆలివ్‌ ఆయిల్‌ను తీసుకుని అందులో నాలుగు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు తలకి పట్టించాలి. ఉదయాన్నే వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో తలను దువ్వి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా మూడురోజులకు ఒకసారి చేస్తూ ఉంటే తలలో పేలన్నీ రాలిపోతాయి.

  • చిన్న గిన్నెలో అయిదు చెంచాల కొబ్బరినూనెను తీసుకుని గోరువెచ్చగా వేడిచేయాలి. అందులో రెండు చెంచాల లవంగాల నూనె వేసి బాగా కలపాలి. దీన్ని మాడు మీద జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. అయిదు గంటల తరువాత దువ్వెనతో శిరోజాలను దువ్వి ఆపైన గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. దీంతో తలలో పేలన్నీ రాలిపోతాయి.

  • రాత్రి పడుకునేముందు తలకు వేపనూనె లేదా టీ ట్రీ ఆయిల్‌ పట్టించి ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.

  • చిన్న కొబ్బరినూనె బాటిల్‌లో అయిదారు చుక్కల పిప్పరమెంట్‌ ఆయిల్‌ (పుదీనా నూనె) లేదా నట్‌మెగ్‌ ఆయిల్‌ (జాజికాయ నూనె) వేసి బాగా కలపాలి. రోజూ ఈ నూనెను తలకు రాసుకుని పేల దువ్వెనతో దువ్వుకుంటూ ఉంటే సమస్య తీరుతుంది.

  • తలస్నానానికి ముందు దువ్వెనలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. అలాగే దిండు గలీబులు, దుప్పట్లను ఎప్పటికప్పుడు గోరువెచ్చని నీటిలో ముంచి ఆరేయాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 05:09 AM