Share News

Kitchen Cleaning: ఇలా చేస్తే జిడ్డు మరకలు మాయం

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:15 AM

వంటగదిలో తరచూ జిడ్డు మరకలు ఏర్పడుతూ ఉంటాయి. వంట చేసేటప్పుడు స్టవ్‌ మీద, దాని వెనక గోడపై నూనె చింది జిడ్డు పేరుకుంటూ ఉంటంది. చిన్న చిట్కాలతో ఈ జిడ్డు మరకలను..

Kitchen Cleaning: ఇలా చేస్తే జిడ్డు మరకలు మాయం

వంటగదిలో తరచూ జిడ్డు మరకలు ఏర్పడుతూ ఉంటాయి. వంట చేసేటప్పుడు స్టవ్‌ మీద, దాని వెనక గోడపై నూనె చింది జిడ్డు పేరుకుంటూ ఉంటంది. చిన్న చిట్కాలతో ఈ జిడ్డు మరకలను ఎలా మాయం చేయాలో తెలుసుకుందాం...

  • ఒక గిన్నెలో రెండు చెంచాల కాఫీ పొడి, రెండు చెంచాల డిష్‌వాష్‌ లిక్విడ్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జిడ్డు మరకల మీద రాసి పది నిమిషాలు నాననివ్వాలి. తరువాత నీళ్లు పోసి కడిగేస్తే జిడ్డు తొలగిపోతుంది.

  • జిడ్డు పేరుకున్న చోట కొద్దిగా ఉప్పు లేదా కార్న్‌ఫ్లోర్‌ చల్లి అరగంట తరువాత పలుచని గుడ్డతో తుడిచేస్తే ఫలితం కనిపిస్తుంది.

  • జిడ్డు మరకలపై బియ్యం కడిగిన నీళ్లు చల్లి బ్రష్‌తో రుద్ది ఆపైన మంచినీళ్లతో కడిగేస్తే చాలు... జిడ్డు పూర్తిగా వదులుతుంది.

  • అరగ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా డిష్‌ వాష్‌ లిక్విడ్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జిడ్డు పేరుకున్న ప్రాంతంలో చల్లి, పావు గంట తరువాత పాత గుడ్డతో తుడిచేస్తే మరకలన్నీ మాయమవుతాయి.

  • ఒక పాత బాటిల్‌లో వైట్‌ వెనిగర్‌, నీటిని సమభాగాలుగా తీసుకుని బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని జిడ్డు మరకల మీద పిచికారీ చేసి పది నిమిషాల తరువాత స్పాంజ్‌తో తుడిచేస్తే సరిపోతుంది.

  • నిమ్మచెక్క మీద కొద్దిగా ఉప్పు వేసి దాంతో గట్టిగా రుద్దితే తేలికపాటి జిడ్డు మరకలు వదిలిపోతాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 01:15 AM