Revive Dying Plants: మొక్కలు వాడిపోతున్నాయా
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:42 AM
మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే మొక్కలు ఒక్కోసారి వడలిపోయి కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు మొక్కలను ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం...
మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే మొక్కలు ఒక్కోసారి వడలిపోయి కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు మొక్కలను ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం...
బియ్యం కడిగిన నీళ్లను ఒక స్ర్పే బాటిల్‌లో పోసి ఉంచుకోవాలి. రోజుకు ఒకసారి ఈ నీళ్లను మొక్క మొదట్లో, కాండం పైన, ఆకుల మీద పిచికారీ చేయాలి. ఇలా వారంపాటు చేస్తే మొక్కలు బలం పుంజుకుంటాయి.
అరటిపండు తొక్కలను చిన్న ముక్కలుగా చేయాలి. వీటిని ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో వేసి నిండా నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి. ఈ నీటిని రోజుకు రెండుసార్లు మొక్కల మొదట్లో కొద్దికొద్దిగా పోయాలి. అరటిపండు తొక్కల్లోని పొటాషియం.. మొక్కలకు జీవాన్ని అందిస్తుంది.
ఒక బకెట్ నీళ్లలో రెండు చెంచాల పసుపు వేసి బాగా కలపాలి. ఈ నీళ్లతో మొక్కల కాండాన్ని, ఆకులను బాగా తడపాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తూ ఉంటే క్రిమికీటకాలు నశించి మొక్కలు ఏపుగా పెరుగుతాయి.
కూరగాయల వ్యర్థాలు, కోడిగుడ్ల పెంకులు, ఉల్లిపాయ తొక్కలను మొక్కల మొదట్లోని మట్టిలో కలుపుతూ ఉండాలి. దీనివల్ల పోషకాలు అంది మొక్కలు బలంగా పెరుగుతాయి.
రోజులో కొద్దిసేపయినా మొక్కలకు సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి. అధిక వేడి, వర్షాల నుంచి మొక్కలను కాపాడాలి. మొక్కల మొదట్లో మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి.
ఎండిపొయిన కొమ్మలు, ఆకులు, పూలను ఎప్పటికప్పుడు తొలగించాలి. మొక్కల అవసరాలకు తగ్గట్టుగా సేంద్రీయ ఎరువులను అందించాలి. అప్పుడే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య
గణేశుడి మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి
Read Latest Telangana News and National News