Durga Navaratri 2025: నేటి అలంకారం శ్రీ రాజరాజేశ్వరీదేవి
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:25 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో చివరి రోజైన విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. సకల భువన బ్రహ్మాండాలకు అధిదేవత ఆమె. షోడశ మహామంత్ర స్వరూపిణి..
దుర్గా నవరాత్రులు
నేటి అలంకారం శ్రీ రాజరాజేశ్వరీదేవి
ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) గురువారం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో చివరి రోజైన విజయదశమి నాడు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. సకల భువన బ్రహ్మాండాలకు అధిదేవత ఆమె. షోడశ మహామంత్ర స్వరూపిణి అయిన అమ్మను మహాత్రిపుర సుందరిగా, అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. అపరాజితాదేవి పేరు మీద ‘విజయదశమి’ ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి ‘విజయ’ అని అంటారు. పరమ శాంత స్వరూపంతో, చిరునవ్వులు చిందిస్తూ, చెరుకుగడ చేతితో పట్టుకుని ఆమె దర్శనమిస్తుంది. మణిద్వీపంలో శ్రీపురంలో నివాసం ఉండే ఆమెను ‘చింతామణి’గా పిలుస్తారని ప్రతీతి. పరమేశ్వరుడి అంకం ఆసనంగా... ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్ఠాన దేవత. ఆమెను కొలిస్తే సమస్త శక్తులూ సమకూరుతాయనీ, ఆ అమ్మ భక్తుల కోరికలను నెరవేరుస్తుందనీ, మనసారా కొలిస్తే బ్రహ్మజ్ఞానం కలుగజేస్తుందనీ నమ్మిక. అమ్మవారిని ఎరుపు రంగు గాజులతో అలంకరించి, కుంకుమార్చన చేయడం శ్రేష్టం.
నైవేద్యం : పరమాన్నం, ఆరు రుచులతో కూడిన (షడ్రసోపేత) పదార్థాలు
అలంకరించే చీర రంగు : ఆకుపచ్చ, తెలుపు
అర్చించే పూల రంగు : ఎరుపు
పారాయణ: చెయ్యాల్సింది : లలితా సహస్రనామం
అర్చన: ఎర్రటి గాజులతో అలంకరించి, కుంకుమార్చన
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News