Diet Soda Health Risks: డైట్ సోడాలతో చేటు
ABN , Publish Date - Aug 12 , 2025 | 04:11 AM
క్యాలరీలు లేని డైట్ సోడాలు ఆరోగ్యానికి చేటు కలిగించవని అనుకోవడం పొరపాటు. వాటితో గుండెకూ, మెదడుకూ చేటు కలుగుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. రోజుకు ఒకటి లేదా రెండు డైట్ సోడాలు తాగే వారికి దాదాపు మూడు రెట్లు గుండెపోటు...
అధ్యయనం
క్యాలరీలు లేని డైట్ సోడాలు ఆరోగ్యానికి చేటు కలిగించవని అనుకోవడం పొరపాటు. వాటితో గుండెకూ, మెదడుకూ చేటు కలుగుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. రోజుకు ఒకటి లేదా రెండు డైట్ సోడాలు తాగే వారికి దాదాపు మూడు రెట్లు గుండెపోటు, అల్జీమర్స్ ముప్పు పొంచి ఉంటుందనే ఒక తాజా అధ్యయనం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జోర్నల్‌లో ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా 2,800 మంది, 45 నుంచి 55 ఏళ్ల వయస్కులను పరీక్షించినప్పుడు, వారికి గుండెపోటు, అల్జీమర్స్ ముప్పు 30ు కంటే ఎక్కువ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అలాగే డైట్ సోడాలోని ఫాస్ఫరస్ ఎముకల సాంద్రతను సన్నగిల్లేలా చేసి ఎముకలను గుల్లబారుస్తుంది. అలాగే దాన్లోని కృత్రిమ చక్కెరలైన ఆస్పర్టేమ్ లేదా స్టీవియాలు నాడీ క్షీణతను పెంచుతాయి. డైట్ సోడాను విపరీతంగా తాడే వారిలో, మూత్రపిండాల సామర్థ్యం కూడా త్వరితంగా క్షీణిస్తుందని నర్సెస్ హెల్త్ స్టడీకి చెందిన పరిశోధకులు కనిపెట్టారు. దాహార్తిని తీర్చుకోవడం కోసం డైట్ సోడాల మీద ఆధారపడడం వల్ల ఈ పానీయంలోని కెఫీన్ ఫలితంగా దాహార్తి తీరకపోగా, అత్యధిక మూత్రవిసర్జనతో శరీరంలో డీహైడ్రేషన్ పెరుగుతుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. దీన్లోని కెఫీన్‌తో నిద్రలేమి సమస్య కూడా వేధిస్తుందనీ, అదే పనిగా డైట్ సోడాలు తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి:
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారత టెక్స్‌టైల్ ఉత్పత్తుల దిగుమతులకు అమెరికా సంస్థల బ్రేక్
పాన్ కార్డు ఇనాక్టివ్ అయ్యిందా.. ఇలా చేస్తే సమస్యకు పరిష్కారం