Health Booster: రోజూ వెల్లుల్లి తింటే
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:04 AM
ఉల్లిలానే వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిని రోజూ తినడం వలన పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
ఉల్లిలానే వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లిని రోజూ తినడం వలన పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీరరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిస్తుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పలు సమస్యలను దరిచేరనీయవు.
వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళాలు శరీరాన్ని నిర్విషీకరణ చేసే ఎంజైమ్‌లను ఉత్తేజితం చేయడంలో సహాయపడతాయి.
వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించి గుండె వ్యాధులు రాకుండా తోడ్పడుతుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వాపులను తగ్గిస్తాయి.
వెల్లుల్లి శరీరంలో రక్తప్రసరణను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఇవి కూడా చదవండి..
శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..
భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి