సీఎస్ఐఆర్ యూజీసీ నెట్
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:21 AM
సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే సీఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఇది జేఆర్‌ఎస్ తోపాటు...
సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే సీఎస్ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఇది జేఆర్‌ఎస్ తోపాటు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఉపయోగపడుతుంది.
పరీక్ష పేపర్లు
కెమికల్ సైన్సెస్
ఫిజికల్ సైన్సెస్
లైఫ్ సైన్సెస్
మేథమెటికల్ సైన్సెస్
ఎర్త్, అట్మాస్ఫియర్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ పాసై ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు 50 శాతం చాలు.
వయస్సు: జేఆర్‌ఎ్‌ఫకు అర్హత విషయానికి వస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 2025 జూలై 1 తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, నాన్ క్రిమిలేయర్ ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్/ పీహెచ్‌డీ ప్రవేశాలకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.
పరీక్ష విధానం: పరీక్ష కంప్యూటర్ బేస్డ్ విధానంలో, మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. నెగెటీవ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1150/-, జనరల్, ఈడబ్ల్యూఎ్‌స/ఓబీసీ(నాన్ క్రిమిలేయర్) రూ.600/-, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.325/-.
దరఖాస్తులకు చివరి తేదీ: 2025 జూన్ 23
పరీక్ష తేదీలు: 2025 జూలై 26, 27, 28
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
వెబ్‌సైట్: https://csirnet.nta.ac.in
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి మహిళలపై వ్యాఖ్యలు.. బాధ్యులపై కఠిన చర్యలు
కిషన్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్ష విమర్శలు
For AndhraPradesh News And Telugu News