Clay Ganesha: మట్టి వినాయకుడిని తయారుచేద్దాం రండి
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:48 AM
స్వహస్తాలతో గణపతిని రూపొందించి అందంగా అలంకరించి పూజిస్తే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అందుకే ఈ వినాయకచవితి పూజ కోసం మట్టితో సులువుగా వినాయకుడిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...
స్వహస్తాలతో గణపతిని రూపొందించి అందంగా అలంకరించి పూజిస్తే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అందుకే ఈ వినాయకచవితి పూజ కోసం మట్టితో సులువుగా వినాయకుడిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..!
1. బంకమట్టిని తెచ్చి నీళ్లు చల్లి మెత్తని ముద్దలా చేయాలి. దాన్ని పదినిమిషాలపాటు నాననివ్వాలి. దానితో అయిదు పెద్ద ఉండలు, అయిదు చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక పెద్ద ఉండను తీసుకుని అరచేతిలో పెట్టుకుని ఒత్తుతూ దీర్ఘచతురస్రాకారపు పీఠంలా తయారు చేయాలి. ఈ పీఠం మధ్యలో మరో పెద్ద ఉండను పెట్టి బొజ్జ ఆకారంలో ఒత్తాలి.
2. మరో రెండు పెద్ద ఉండలను తీసుకుని కాళ్ల మాదిరిగా ఒత్తి బొజ్జకు ఇరు పక్కలా అమర్చాలి. ఈ కాళ్ల చివర్లలో కొద్దిగా నొక్కి పాదాల మాదిరిగా చేయాలి. సన్నని పుల్లతో వేళ్లు, అందెలు తీర్చిదిద్దాలి. బొజ్జ మీద మరో పెద్ద ఉండను ఛాతీ ఆకారంలో తీర్చిదిద్దాలి.
3. రెండు చిన్న ఉండలను చేతుల మాదిరి చేసి రెండింటినీ మధ్యకు కొద్దిగా వంచాలి. ఒక దాన్ని అభయ హస్తంలా చేయాలి. రెండోదానికి లడ్డూని ఉంచడానికి వీలుగా అరచేయి ఉండేలా వేళ్లతో నొక్కాలి. సన్నని పుల్లతో వేళ్లు, చేతులకు ఆభరణాలు గీయాలి. ఈ చేతులను ఛాతికి ఇరువైపులా అమర్చాలి. ఛాతిపైన మరో చిన్న ఉండను పెట్టి ముఖాకృతి వచ్చేలా నొక్కాలి. మిగిలిన రెండు చిన్న ఉండలతో చెవులు తయారుచేసి ముఖానికి ఇరువైపులా అతికించాలి.
4. కొద్దిగా బంకమట్టిని తీసుకుని తొండం మాదిరి చేసి కుడివైపునకు కొద్దిగా తిప్పాలి. దీన్ని ముఖం మధ్య భాగంలో అతికించాలి. తొండానికి ఎడమవైపున పూర్తి దంతం, కుడివైపున సగం దంతాన్ని అమర్చాలి. ముఖం మీద కళ్లు దిద్దాలి. ఇంకాస్త బంకమట్టిని తీసుకుని హారంలా చేసి ఛాతి మీద నుంచి బొజ్జ వరకు వచ్చేలా అతికించాలి. అలాగే యజ్ఞోపవీతం, నాగాభరణం కూడా పెట్టుకోవచ్చు.
5. మిగిలిన బంకమట్టితో మీకు నచ్చిన ఆకృతిలో కిరీటం తయారుచేసి తలమీద అతికించాలి. అంతే! వినాయకుడు పూజకు రెడీ..!
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..