Share News

Christmas Celebration: అతిథులకు ఆహ్వానం

ABN , Publish Date - Dec 25 , 2025 | 02:17 AM

క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పేందుకు స్నేహితులు, బంధువులు ఇంటికి వస్తుంటారు. కాబట్టి అతిథులను సాదరంగా ఆహ్వానించేందుకు చేయాల్సిన ఏర్పాట్లతోపాటు ఇంటిని అందంగా ఎలా అలంకరించాలో తెలుసుకుందాం...

Christmas Celebration: అతిథులకు ఆహ్వానం

క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పేందుకు స్నేహితులు, బంధువులు ఇంటికి వస్తుంటారు. కాబట్టి అతిథులను సాదరంగా ఆహ్వానించేందుకు చేయాల్సిన ఏర్పాట్లతోపాటు ఇంటిని అందంగా ఎలా అలంకరించాలో తెలుసుకుందాం...

ఇల్లు అందంగా ఇలా..

  • క్రిస్మస్‌ శోభ ఉట్టిపడేలా శాంటాక్లాజ్‌, రెయిన్‌ డీర్‌, స్నోమెన్‌, స్నోఫ్లేక్స్‌, క్యాండీ కేన్స్‌, బెల్స్‌, స్టార్స్‌, ఏంజెల్స్‌ లాంటివాటితో ఇంటిని అలంకరించాలి. వీటిలో ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ, నీలం, సిల్వర్‌ వైట్‌, గోల్డెన్‌ ఎల్లో రంగులు ఉండేలా చూసుకోవాలి.

  • ఇంట్లో అక్కడక్కడా రంగు రంగుల క్యాండిల్స్‌ ఏర్పాటు చేయాలి. ప్లెయిన్‌, సెంటెడ్‌, నావెల్టీ క్యాండిల్స్‌... ఇంటిని రిచ్‌గా మారుస్తాయి. కిటికీల్లో, అరల్లో ఎలక్ట్రిక్‌ క్యాండిల్స్‌ను పెట్టవచ్చు.

క్యాండిల్‌ ట్రీ లైట్స్‌ కూడా ఇంటికి అదనపు శోభనిస్తాయి.

  • ఇంటి సింహద్వారానికి క్రిస్మస్‌ గార్లండ్‌ను తగిలిస్తే చూడడానికి బాగుంటుంది. కాస్త ఖరీదు ఎక్కువైనప్పటికీ లైవ్‌ గ్రీనరీ గార్లండ్‌ను తెచ్చుకుంటే ప్రత్యేకంగా ఉంటుంది. అదే ఆర్టిఫీషియల్‌ గార్లండ్స్‌ అయితే ఏటా వాడుకోవచ్చు. వీటికి లైట్‌ స్ట్రింగ్స్‌ను కూడా జోడించవచ్చు. గార్లండ్‌కు గోల్డ్‌ రోపింగ్‌ను జతచేస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

  • గుమ్మానికి ఇరుపక్కలా రంగు రంగుల ఫాయిల్‌ పేపర్లతో చుట్టిన పొయిన్సెటియా పాట్‌లను పెడితే అందంగా ఉంటుంది. అలాగే ఇంటి ముందు పెద్ద స్ఠార్‌ను వేలాడదీస్తే కళగా ఉంటుంది.

  • ఇంటికి క్రిస్మస్‌ కళను పెంచడంలో రీత్స్‌ ముందుంటాయి. ప్రస్తుతం ఎన్నో రకాల రీత్స్‌ లభ్యమవుతున్నాయి. తలుపులకు, కిటికీలకు, మ్యాంటిల్‌ మీద రీత్స్‌ను తగిలిస్తే అహ్లాదకరంగా ఉంటుంది. వీటిని రంగు రంగుల రిబ్బన్స్‌తో అలంకరిస్తే అందరి దృష్టి వాటిమీదే ఉంటుంది. అలాగే ఇంట్లో అక్కడక్కడ క్రిస్మస్‌ స్వాగ్స్‌ను అలంకరిస్తే పండుగ శోభ ఉట్టిపడుతుంది.


క్రిస్మస్‌ ట్రీ...

ఫ హాల్లో అందరికీ కనిపించేలా క్రిస్మస్‌ ట్రీని ఏర్పాటు చేయాలి. దానికి గుండ్రని గ్లాస్‌ బాల్స్‌, రంగురంగుల స్టార్స్‌, నావెల్టీ ఆర్నమెంట్స్‌ అలంకరించాలి. వివిధ సైజుల్లో వెండి, బంగారు వర్ణాల్లో ఉండే ఆర్నమెంట్స్‌.. క్రిస్మస్‌ ట్రీకి గ్రాండ్‌ లుక్‌నిస్తాయి. చుట్టూరా ఫాదర్‌ జోపెఫ్‌, మేరీ మాత, బేబీ జీసెస్‌, దేవదూతలు, మేకలు, గొర్రెలు, పవువుల కాపరుల బొమ్మలు అరేంజ్‌ చేయవచ్చు. ఎదురుగా ఎరుపు, ఆకుపచ్చ ఫాయిల్‌ పేపర్లతో ఉన్న పోయిన్సెటియా పాట్‌లు పెడితే అందంగా ఉంటుంది. క్రిస్మస్‌ ట్రీకి లైటింగ్‌ను కూడా అరేంజ్‌ చేస్తే రాత్రిపూట చూడడానికి బాగుంటుంది.

ఆతిథ్యం...

  • పండుగ రోజున ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు కేక్‌లు, కుకీలు, హెల్దీ డ్రింక్‌లతో స్వాగతం చెప్పవచ్చు. అందుకు తగ్గ ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలి.

  • డైనింగ్‌ టేబుల్‌ మీద అతిథులకు వడ్డించాల్సిన మీల్స్‌, వాటర్‌ బాటిల్స్‌, ఫ్రూట్స్‌, స్వీట్స్‌ను అందంగా సర్దాలి. మధ్య మధ్యలో పూల గుత్తులు, క్యాండిల్స్‌ అమరిస్తే ప్రత్యేకంగా ఉంటుంది.

బహుమతులు

ఫ అతిథులకు ఇవ్వాల్సిన బహుమతులను ముందుగానే అందంగా ప్యాక్‌ చేసి క్రిస్మస్‌ ట్రీ వద్ద సర్దిపెట్టాలి. అందరికీ ఉపయోగపడేవాటిని మాత్రమే బహుమతులుగా ఎంపిక చేసుకోవాలి. న్యూ ఇయర్‌ క్యాలెండర్స్‌, డైరీస్‌, డ్రై ఫ్రూట్స్‌ బాక్స్‌లు, మంచి పుస్తకాలు, పెర్ఫ్యూమ్‌ బాటిల్స్‌, అందమైన పెన్స్‌, రంగురంగుల పౌచ్‌లు ఇవ్వవచ్చు. చిన్న పిల్లలకు హెల్దీ చాక్లెట్‌ బార్స్‌, కలర్‌ పెన్సిల్స్‌, డ్రాయింగ్‌ బుక్స్‌, కామిక్స్‌, స్టోరీ బుక్స్‌ లాంటివి ఇస్తే బాగుంటుంది.

ఇవి కూడా చదవండి...

వీరన్న హత్య కేసులో వీడిన మిస్టరీ... అసలు నిజం ఇదే

తిప్పలు పెడితే రాసుకోండి.. మిత్తీతో సహా తీర్చేద్దాం: హరీష్ రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 25 , 2025 | 02:17 AM