Share News

Can Heart Disease People Eat Eggs: హృద్రోగులు గుడ్లు తినొచ్చా

ABN , Publish Date - Oct 28 , 2025 | 01:37 AM

వారానికి ఏడు చొప్పున గుడ్లను మితంగా తినడం వల్ల ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో గుండె, రక్తనాళాల సమస్యలు పెరగవనే ఒక విశ్లేషణ మాయో క్లినిక్‌లో ప్రచురితమైంది. మరిన్ని వివరాలు....

Can Heart Disease People Eat Eggs: హృద్రోగులు గుడ్లు తినొచ్చా

అవగాహన

వారానికి ఏడు చొప్పున గుడ్లను మితంగా తినడం వల్ల ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో గుండె, రక్తనాళాల సమస్యలు పెరగవనే ఒక విశ్లేషణ మాయో క్లినిక్‌లో ప్రచురితమైంది. మరిన్ని వివరాలు....

సమతులాహారంలో భాగంగా కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు గుడ్లను కూడా తీసుకోవచ్చు. పీచు, అన్‌శాచురేటెడ్‌ కొవ్వులతో పాటు గుడ్లను మితంగా తిన్నంత కాలం గుండె జబ్బులు దరి చేరే అవకాశాలు తక్కువని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కూడా మరొక విశ్లేషణను ప్రచురించింది. అయితే వారానికి 12 అంతకంటే ఎక్కువ గుడ్లను తినడం వల్ల గుండె జబ్బు ముప్పు కచ్చితంగా పెరుగుతుంది. ప్రత్యేకించి చెడు కొలెస్ట్రాల్‌ మోతాదులు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. నిజానికి గుడ్డుతో గుండెకు రక్షణ కల్పించుకోవచ్చు. గుడ్డు జోలికి వెళ్లని వాళ్లతో పోల్చితే, వారానికి పరిమితంగా ఒకటి నుంచి మూడు గుడ్లు తినే వాళ్లలో గుండె జబ్బుల ముప్పు ఎంతో తక్కువగా ఉంటున్నట్టు సూచించే ఒక అధ్యయనం కూడా గ్రీస్‌కు చెందిన యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ కార్డియాలజీలో ప్రచురితమైంది. ఆరోగ్యం కేవలం ఒక పదార్థం మీదే ఆధారపడి ఉండదనీ, పరిపూర్ణ ఆరోగ్యానికి ఆహార, జీవనశైలులు, పోషకాలు దోహదపడతాయని వైద్యులు ఈ అధ్యయనంలో పేర్కొంటున్నారు. ప్రాసెస్‌ చేసిన పదార్థాలకు బదులుగా గుడ్లను తినడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కానీ గుడ్లను, శాచురేటెడ్‌ కొవ్వులతో కలిపి తిన్నప్పుడు ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం పడుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

For More AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 01:37 AM