Can Liver Cirrhosis Be Reversed: సిర్రోసిస్ రివర్స్ సాధ్యమే
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:32 AM
కాలేయ సమస్య సిర్రోసిస్ అనగానే తిరిగి సరిదిద్దలేని సమస్య కాబట్టి చావు దగ్గరపడినట్టు భావిస్తారు. బ్రతికే అవకాశాలు లేవని నిర్థారించుకుని ఙచికిత్సకు దఙూరంగా ఉండిపోతఙూ ఉంటారు. కానీ...
కాలేయ ఆరోగ్యం
కాలేయ సమస్య సిర్రోసిస్ అనగానే తిరిగి సరిదిద్దలేని సమస్య కాబట్టి చావు దగ్గరపడినట్టు భావిస్తారు. బ్రతికే అవకాశాలు లేవని నిర్థారించుకుని ఙచికిత్సకు దఙూరంగా ఉండిపోతఙూ ఉంటారు. కానీ మల కారణాలను సరిదిద్దుకోగలిగితే, కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో సిర్రోసి్‌సను సైతం రివర్స్ చేయొచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అదెలాగో తెలుసుకుందాం!
హెపటైటిస్ బి, సి, అత్యధిక మద్యపానం, ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆటోఇమఙ్యూన్ డిజర్డర్ల వల్ల కాలేయం దెబ్బతింటఙూ, ఫైబ్రోసి్‌సకఙూ, అంతిమంగా సిర్రోసిస్ దశకు చేరుకుంటుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా సిర్రోసి్‌సను తిరిగి సరిదిద్దలేని కాలేయ సమస్యగా పరిగణిసఙ్తూ వచ్చారు. ఙచివరి దశ వ్యాధికి అంతిమంగా కాలేయ వఙూర్పిడి ఒక్కటే పరిష్కారమని నిర్థారిసఙ్తూ వచ్చారు. అయితే కాలేయ వఙూర్పిడి అంతర్లీన ముప్పులు, సవాళ్లతో కఙూడుకున్న ఙచికిత్స. కాలేయ వఙూర్పిడి ఙచికిత్సలో.. అవయవ దాన కొరతతో పాటు జీవితకాలం వ్యాధినిరోధకశక్తిని అణఙచి ఉంచే ఙచికిత్సల అవసరం లాంటి ఇబ్బందులు తప్పవు. అయితే సరైన సమయంలో అప్రమత్తమై, సిర్రోసి్‌సకు మఙూల కారణాలను కనిపెట్టి వాటిని తగిన ఙచికిత్సలతో సరిదిద్దుకోగలిగితే, సిర్రోసిస్ దశకు చేరుకున్న కాలేయఙూన్ని పూర్తి ఆరోగ్యకరంగా వఙూర్చే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది.
కారణాలకే ఙచికిత్సలు
కాలేయం జబ్బుపడి సిర్రోసి్‌సకు చేరుకోడానికి ప్రధాన కారణాలైన హెపటైటిస్ బి, సిలకు ఙచికిత్సలున్నాయి. ఫ్యాటీ లివర్‌కు కఙూడా ఙచికిత్సలున్నాయి. వీటిని సకాలంలో గుర్తింఙచి ఙచికిత్స తీసుకోగలిగితే కాలేయం సిర్రోసిస్ దశకు చేరుకోకుండా ఉంటుంది. అలాగే కాలేయం దెబ్బతింటున్న సఙూచనలు కొన్ని పరీక్షల్లో ముందుగానే బయల్పడతాయి. ప్లేట్‌లెట్స్ తక్కువైపోవడం, కాలేయం సాధారణంగానే ఉన్నప్పటికీ ప్లీహం పరివఙూణం పెరగడం లాంటి లక్షణాలు కనిపింఙచినప్పుడు, ఫైబ్రోస్కాన్ చేయించుకుంటే, కాలేయ సమస్యను ముందుగానే పసిగట్టే వీలుంటుంది. ఈ దశలోనే అప్రమత్తమై ఙచికిత్స తీసుకోగలిగితే కాలేయం సిర్రోసి్‌సకు చేరుకోకుండా నియంత్రించుకోవచ్చు. సిర్రోసి్‌సకు చేరుకున్నప్పటికీ తొలి దశలోనే కనిపెట్టవచ్చు.
వీళ్లు అప్రమత్తం
కొందరికి హెపటైటిస్ బి, సి, కాలేయ కొవ్వు సమస్యల ముప్పును ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ. వాళ్లెవరంటే...
క్రమం తప్పకుండా మద్యం సేవించేవారు
ఐదేళ్లకు మింఙచి మఽధుమేహంతో బాధపడుతున్నవాళ్లు
కామెర్ల బారిన పడినవాళ్లు
సర్జరీ లేదా ఇతరత్రా కారణాలతో రక్తవఙూర్పిడి చేయించుకున్నవాళ్లు
సిర్రోసిస్ ఙచికిత్స ఇలా...
వైద్యులు, మఙూల కారణాన్ని కనిపెట్టడమే కీలకంగా సిర్రోసిస్ ఙచికిత్స మొదలుపెడతారు. అవేంటంటే..
రక్తనాళంలో అవరోధం: శరీరం నుంచి గుండె రక్తాన్ని సరఫరా చేసే అతి పెద్ద రక్తనాళం కాలేయంలో ఉంటుంది. ఈ రక్తనాళంలో అవరోధం ఏర్పడినా కాలేయం సిర్రోసి్‌సకు దారితీస్తుంది. ఈ కారణంగా సిర్రోసిస్ తలెత్తినప్పుడు, అవరోధాన్ని తొలగింఙచి స్టెంట్ సహాయంతో రక్తప్రవాహాన్ని పునరుద్ధరించగలిగితే సిర్రోసిస్ తగ్గుముఖం పడుతుందని రుజువైంది
సెకండరీ బిలేరీ సిర్రోసిస్: పిత్తాశయంలో నుంఙచి బైల్‌డక్ట్ పేగుల్లోకి ప్రయఙూణిస్తుంది. దీనికి అవరోధం ఏర్పడితే, కాలేయ సిర్రోసిస్ తలెత్తుతుంది. ఈ అవరోధాన్ని తొలగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు
ఫ్యాటీ లివర్ డిసీజ్: కాలేయ కొవ్వు మఙూలంగా, సిర్రోసిస్ దశలోకి ప్రవేశింఙచినప్పటికీ, తొలి దశలోనే గుర్తింఙచి, తాజా మందులు, జీవనశైలి వఙూర్పులతో సిర్రోసి్‌సను రివర్స్ చేసుకోవచ్చు
హెపటైటిస్: హెపటైటిస్ బిని తొలి దశలోనే కనిపెట్టి ఙచికిత్సను అందించగలిగితే కాలేయం పూర్తిగా కోలుకుంటుంది
50% మందికే...
సిర్రోసిస్ దశకు చేరుకున్న ప్రతి ఒక్కర్లో ఈ రుగ్మత రివర్స్ అయ్యే అవకాశాలు ఉండవు. కేవలం 50ు మంది రోగులు వఙూత్రమే నఙూరు శాతం కోలుకోగలుగుతారు. ఇలా కోలుకున్న 50 శాతం మందికీ కాలేయ వఙూర్పిడి అవసరం ఉండదు. సిర్రోసిస్ దశ ఈ విషయంలో కీలకంగా వఙూరుతుంది. ఇది ప్రగతిశీల వ్యాధి కాబట్టి వీలైనంత త్వరగా సిర్రోసి్‌సను గుర్తింఙచి ఙచికిత్స మొదలుపెట్టడం అవసరం. ఙచివరి దశలో సిర్రోసి్‌సను గుర్తింఙచి, ఎంతటి సమర్థమైన ఙచికిత్సను అందింఙచినప్పటికీ జబ్బు నయం అవకపోవచ్చు. కాబట్టి ప్రారంభంలోనే వ్యాధిని నిర్థారించుకుని, తగినఙచికిత్స తీసుకోవాలి.
ఈ లక్షణాలు గమనించాలి
కాలేయ సిర్రోసిస్ కొన్ని లక్షణాల రఙూపంలో బయల్పడుతుంది. అవేంటంటే...
తొలి దశలో...
సులభంగా, త్వరగా అలసిపోవడం
కాళ్ల వాపులు. కాళ్లు ఎత్తులో ఉంఙచినప్పుడు వాపు తగ్గడం
కుడి వైపు పొత్తికడుపులో నొప్పి
రెండో దశలో...
మలం నలుపు రంగు
కడుపులో నీరు చేరి కడుపుబ్బరం
కాళ్ల వాపులు తగ్గకపోవడం
తుది దశల్లో...
సిర్రోసిస్ తుది దశల్లో సైతం వ్యాధిని అక్కడితో ఆపి, మరింత తీవ్రమవకుండా నియంత్రించుకోవచ్చు. ఇందుకు సమర్థమైన ఙచికిత్సలున్నాయి. సిర్రోసి్‌సతో కాలేయం పూర్తిగా విఫలమైనప్పుడు కాలేయ వఙూర్పిడిని అంతిమ ఙచికిత్సగా వైద్యులు ఎంచుకుంటారు. అయితే కాలేయ వఙూర్పిడికి ముందు, సిర్రోసిస్ తొలిదశలో వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తుల జీవితకాలం 9 నుంఙచి 12 సంవత్సరాలు. ఙచివరి దశలో నిర్థారణ అయిన రోగుల జీవితకాలం 3 నుంఙచి 4 సంవత్సరాలు. అయితే ఙచివరి దశ సిర్రోసి్‌సకు చేరుకున్న రోగుల జీవితకాలాన్ని కఙూడా 9 నుంఙచి 12 సంవత్సరాలకు పెంచే ఙచికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఙచికిత్సతో వ్యాధి పురోగతిని నియంత్రింఙచి, ఉన్న దశకే పరిమితం చేసి, జీవన నాణ్యతను పెంచుకోగలిగితే కాలేయ వఙూర్పిడి అవసరతను వాయిదా వేయగలిగే వీలుంటుంది.
డాక్టర్ కె.ఎస్. సోమశేఖర రావు
సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో
ఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్,
క్లినికల్ డైరెక్టర్, యశోద హాస్పిటల్,
హైటెక్ సిటీ, హైదరాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Read Latest National News And Telugu News