Share News

చల్లటి నీళ్లు తాగవచ్చా..?

ABN , Publish Date - Mar 19 , 2025 | 04:50 AM

వేసవి వచ్చేసింది. మధ్యాహ్నం బయటకు వెళ్తే ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో చల్లటి నీళ్లు తాగితే ఫ్రాణం లేచి వస్తుంది. అయితే రిఫ్రిజిరేటర్‌ నుంచి తీసిన చల్లటి నీళ్లను తాగవద్దని...

చల్లటి నీళ్లు తాగవచ్చా..?

వేసవి వచ్చేసింది. మధ్యాహ్నం బయటకు వెళ్తే ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో చల్లటి నీళ్లు తాగితే ఫ్రాణం లేచి వస్తుంది. అయితే రిఫ్రిజిరేటర్‌ నుంచి తీసిన చల్లటి నీళ్లను తాగవద్దని.. తాగితే ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వెనకున్న కారణాలు వివరిస్తున్నారు.

  • ఎండ వేడికి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గి దాహంగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగితే వాటిని శరీరం శోషించలేదు. దీని వల్ల తలనొప్పి, మూత్రం రాకపోవడం, అలసట, కండరాల తిమ్మిరి లాంటి సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల బాగా దాహంగా ఉన్న సమయంలో మామూలు నీళ్లు లేదా కుండలోని నీళ్లు తాగడం మంచిది.

  • బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయం పనితీరు మందగిస్తుంది. తిన్న ఆహారపదార్థాలు త్వరగా జీర్ణం కావు. దీంతో అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు ఏర్పడతాయ


  • బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగడం వల్ల శ్వాసకోశంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. దీంతో ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. అందుకే ఎండలో తిరిగి ఇంటికి రాగానే చల్లటి నీళ్లు తాగితే వెంటనే జలుబు చేయడం, గొంతు మంట లాంటివి గమనించవచ్చు. ఎక్కువ సార్లు ఈ నీళ్లు తాగితే ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుని ముక్కు దిబ్బడ, పొడిదగ్గు వేధిస్తాయి.

  • దాహం అనిపించినప్పుడు బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగితే నాడీ వ్యవస్థ ప్రభావిత మవుతుంది. దీని వల్ల దంతాలపై ఉండే ఎనామిల్‌ పొర, చిగుళ్లలో ఉండే సున్నితమైన నరాలు దెబ్బతిని పళ్లు జివ్వుమంటాయి.

ఇవి కూడా చదవండి..

Shocking Video: సముద్రంపై ఓడ.. కమ్ముకొస్తున్న తుఫాను.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి..

Viral Stunt Video: వామ్మో.. ఈ కుర్రాడి ట్యాలెంట్ చూస్తే అబ్బురపోవాల్సిందే.. వీడియో వైరల్..

Lion Viral Video: సింహం పిల్ల చిలిపి పని.. ఉలిక్కి పడిన మృగరాజులు.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2025 | 04:50 AM