Kangaroo Care: కంగారూ కేర్‌తో మెదడు ఎదుగుదల
ABN , Publish Date - Oct 07 , 2025 | 01:18 AM
ప్రసవం తదనంతరం పసికందుకు తల్లి ఎంత దగ్గరగా ఉంటే అంత మెరుగ్గా బిడ్డ మెదడు ఎదుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. కంగారూ కేర్‌లో భాగంగా, తరచూ బిడ్డను శరీరానికి హత్తుకోవడం వల్ల, నెలలు నిండకుండా పుట్టిన...
బిడ్డల రక్షణ
ప్రసవం తదనంతరం పసికందుకు తల్లి ఎంత దగ్గరగా ఉంటే అంత మెరుగ్గా బిడ్డ మెదడు ఎదుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. కంగారూ కేర్‌లో భాగంగా, తరచూ బిడ్డను శరీరానికి హత్తుకోవడం వల్ల, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో మెదడు ఎదుగుదల సమస్యలు సర్దుకుంటాయని పరిశోధకులు అంటున్నారు.
32 వారాలకంటే ముందే పుట్టిన పిల్లల్లో ఎదుగుదల లోపాలుంటాయి. ఎదిగే క్రమంలో ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అయితే ఈ లోపాలను సరిదిద్దే ఒక తాజా ఉపాయాన్ని పరిశోధకులు ఒక ప్రయోగం ద్వారా కనిపెట్టారు. ఇందుకోసం 88 మంది నెలలు నిండకుండా పుట్టిన పిల్లల విషయంలో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదా కంగారూ కేర్ పద్ధతిని అనుసరించారు. దీన్లో భాగంగా రెండు నెలల పాటు రోజు మొత్తంలో కనీసం 24 నిమిషాల నుంచి 70 నిమిషాల పాటు పసికందులను తల్లికి చేరువగా ఉంచారు. ఆ తర్వాత పిల్లల మెదళ్లకు ఎమ్మారై స్కాన్ చేసినప్పుడు, ఇలాంటి పద్ధతి ఫలితంగా పిల్లల మెదళ్లలోని... ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, భావోద్వేగ నియంత్రణలకు సంబంధించిన పాత్‌వే్‌స మార్పులు జరగడాన్ని పరిశోధకులు గమనించారు.
ఇవి కూడా చదవండి..
ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News