Share News

Best Time to Eat Seeds: విత్తనాలు ఎప్పుడు తినాలి

ABN , Publish Date - Sep 16 , 2025 | 02:34 AM

శరీరం సమర్థంగా శోషించుకోవడం కోసం కొన్ని విత్తనాలను కొన్ని నిర్దిష్ట సమయాల్లోనే తినాలంటున్నారు ఎయిమ్స్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌, డాక్టర్‌ సౌరభ్‌ సేథి. మరిన్ని వివరాలు...

Best Time to Eat Seeds: విత్తనాలు ఎప్పుడు తినాలి

తెలుసుకుందాం

శరీరం సమర్థంగా శోషించుకోవడం కోసం కొన్ని విత్తనాలను కొన్ని నిర్దిష్ట సమయాల్లోనే తినాలంటున్నారు ఎయిమ్స్‌ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌, డాక్టర్‌ సౌరభ్‌ సేథి. మరిన్ని వివరాలు...

చియా విత్తనాలు: ఈ విత్తనాల్లోని పీచు జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది, రక్తంలో చక్కెర మోతాదులను స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి వీటిని ఉదయాన్నే లేదా వ్యాయామానికి ముందు తినాలి.

అవిసె: వీటిని ఉదయాన్నే తినాలి. మెత్తగా దంచి తినడం వల్ల పొట్టలోని ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది.

నువ్వులు: వీటిలోని క్యాల్షియం ఎముకల సాంద్రతను పెంచుతుంది. రాత్రివేళ ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ తగ్గుతుంది కాబట్టి వీటిని రాత్రి భోజనంలో తినాలి.

సోంపు: వీటిలోని అనెథోల్‌ పొట్టలోని కండరాలను రిలాక్స్‌ చేసి పొట్ట ఉబ్బరం తగ్గిస్తుంది కాబట్టి వీటిని భోజనం తర్వాత తినాలి.

నానబెడితే?

చియా, సబ్జా విత్తనాలను నానబెట్టడం వల్ల వాటి బాహ్య పొర బెత్తబడి, పోషకాలు మరింత మెరుగ్గా శోషణ చెందడానికి తోడ్పడే ఎంజైమ్స్‌ విడుదల అవుతాయి. చియా విత్తనాలను నీళ్లలో నానబెట్టినప్పుడు అవి 12 రెట్లు బరువు పెరుగుతాయి. అలాగే జీర్ణశక్తికి తోడ్పడే జిగట పదార్థాన్ని కూడా విడుదల చేస్తాయి. దాంతో ఆకలి అదుపులో ఉంటుంది. వీటిలో విటమిన్‌ బి, ఖనిజలవణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇలా నానబెట్టిన చియా, సబ్జాలను పరగడుపున తీసుకోవడం వల్ల, అప్పటివరకూ ఉపవాస స్థితిలో ఉన్న శరీరానికి సరిపడా శక్తి అందుతుంది. అలాగే ఏ విత్తనమైనా ఒకటి నుంచి రెండు స్పూన్లకు పరిమితం చేయాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 02:34 AM