Share News

Best Protein Sources for Vegetarians: శాకాహారులకు ప్రొటీన్లు ఎలా

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:27 AM

రోగనిరోధక శక్తి పెంపొందడానికి, ఎముకల బలోపేతానికి, హార్మోన్ల సమతౌల్యానికి, ప్రశాంతమైన నిద్రకు ప్రొటీన్లు దోహదం చేస్తాయి. శరీరానికి...

Best Protein Sources for Vegetarians: శాకాహారులకు ప్రొటీన్లు ఎలా

రోగనిరోధక శక్తి పెంపొందడానికి, ఎముకల బలోపేతానికి, హార్మోన్ల సమతౌల్యానికి, ప్రశాంతమైన నిద్రకు ప్రొటీన్లు దోహదం చేస్తాయి. శరీరానికి అవసరమైన మోతాదులో ప్రొటీన్లు అందాలంటే శాకాహారులు ఏ పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం...

  • శనగలు, పెసలు, మినపగుండ్లు, రాజ్మా, చిక్కుళ్లు, బఠాణీలు, క్వినోవా, పాలు, పెరుగు, పన్నీర్‌ తదితరాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రొటీన్లు పొందవచ్చు. .

  • రోజుకు పావు కప్పు సోయాబీన్స్‌ను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రొటీన్లలో 70 శాతం వరకు అందుతుంది. ఒక కప్పు సోయా పాలు తాగినా ఫలితం లభిస్తుంది.

  • నువ్వులు, అవిసెలు, గుమ్మడి గింజలను రోజుకు ఒక రకాన్ని రెండు చెంచాల చొప్పున ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో ప్రొటీన్ల లోపం ఏర్పడదు.

  • రోజూ రాత్రి పడుకునేముందు పది బాదం పప్పులను నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు లభిస్తాయి.

  • వేరుశనగ గుండ్లలో అర్జినైన్‌ అనే ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిని నేరుగా వేయించుకుని తినవచ్చు లేదా నీటిలో నానబెట్టి గుగ్గిళ్లు చేసుకోవచ్చు.

  • జామ, పనస, బ్లాక్‌ బెర్రీ, కివీ, చెర్రీ, అరటి, నారింజ, దానిమ్మ పండ్లలో కూడా కొద్దిమోతాదులో ప్రొటీన్లు ఉంటాయి. వీటిని తరచూ తింటూ ఉంటే శరీరంలో ప్రొటీన్‌ లోపం ఏర్పడదు.

ఈ వార్తలు కూడా చదవండి..

థాయ్‌లాండ్‌లో కనిపించిన గౌరవ్ లూథ్రా

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం విచారణ.. రేపటికి వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 05:27 AM