Sweet Potato Benefits: చలిలో చిలగడదుంప
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:14 AM
శీతాకాలంలో చలికి బద్దకంగా అనిపిస్తుంది. ఆకలి కూడా అంతగా వేయదు. శరీరం త్వరగా శక్తిని కోల్పోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చిలగడదుంపలను...
శీతాకాలంలో చలికి బద్దకంగా అనిపిస్తుంది. ఆకలి కూడా అంతగా వేయదు. శరీరం త్వరగా శక్తిని కోల్పోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చిలగడదుంపలను తింటే ప్రయోజనకరం.
చిలగడదుంపల్లో ఎ, సి, డి విటమిన్లతోపాటు బీటా కెరోటిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శ్వాసకోశాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి. చిలగడదుంపలను ఉడికించి తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు బలోపేతమవుతాయి. కంటి సమస్యలు తొలగిపోతాయి.
చలికాలంలో తరచూ చిలగడదుంపలను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పిండిపదార్థాలు లభిస్తాయి. ఇవి క్రమంగా శక్తిని విడుదల చేస్తూ అలసటను పోగొడతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!
తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్
For More AP News And Telugu News