Benefits of Reading Books: పుస్తకాలు చదువుదాం
ABN , Publish Date - Dec 20 , 2025 | 06:33 AM
పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరగడమే కాదు ఎన్నో రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అవి...
పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరగడమే కాదు ఎన్నో రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అవి...
కథలు, నవలలు చదవడం వల్ల ఆలోచనా శక్తి, పరిశీలనాత్మక ధోరణి పెరుగుతాయి. దీంతో మెదడులో న్యూరాన్లు వృద్ధిపొంది చురుకుదనాన్ని, జ్ఞాపకశక్తిని, నిర్ణయాత్మక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రోజూ అరగంటసేపు పుస్తకాలు చదివితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనసు, శరీరం రెంటికీ విశ్రాంతి లభిస్తుంది.
రాత్రి పడుకునేముందు మనసును అహ్లాదపరిచే పుస్తకాలు చదివితే హాయిగా నిద్ర పడుతుంది.
పుస్తకాలు చదువుతున్నప్పుడు మెదడులో ఎన్నో రకాల దృశ్యాలు కదలాడుతుంటాయి. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది.
తరచూ మంచి పుస్తకాలు చదువుతుంటే సానుకూల దృక్పథం పెరుగుతుంది. నిరాశ, నిస్పృహలు దరిచేరవు. ఎప్పుడూ ఉత్సాహంగా అనిపిస్తుంది.
పిల్లలకు చిన్నప్పటి నుంచీ పుస్తకాలు చదవడం అలవాటు చేస్తే వారిలో ఊహా శక్తి, సృజనాత్మకత పెంపొందుతాయి. ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, పరస్పర సహకారం అలవడతాయి.
పుస్తక పఠనం.. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. సమాజం, సంస్కృతులపై అవగాహన కల్పిస్తుంది. ఆత్మవిశ్వాసంతోపాటు భావ వ్యక్తీకరణ, సంభాషణ నైపుణ్యాలను మెరుగ్ఝు పరుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ
For More AP News And Telugu News