Share News

Jaggery Face Pack: బెల్లంతోనూ ఫేస్‌ప్యాక్‌

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:24 AM

అందంగా కనిపించేందుకు అనేక రకాల ఫేస్‌ప్యాక్‌లు, స్క్రబ్‌లు వాడుతుంటారు. వంటింట్లో ఉండే బెల్లంతో కూడా ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకుని చర్మాన్ని మెరిపించవచ్చు. మరి వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం...

Jaggery Face Pack: బెల్లంతోనూ ఫేస్‌ప్యాక్‌

అందంగా కనిపించేందుకు అనేక రకాల ఫేస్‌ప్యాక్‌లు, స్క్రబ్‌లు వాడుతుంటారు. వంటింట్లో ఉండే బెల్లంతో కూడా ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకుని చర్మాన్ని మెరిపించవచ్చు. మరి వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం...

  • గిన్నెలో ఒక టేబుల్‌ స్పూన్‌ బెల్లం తురుమును వేయాలి. అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, టేబుల్‌ స్పూన్‌ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌ చర్మం తేమ కోల్పోకుండా సహాయపడుతుంది.

  • ఒక టేబుల్‌ స్పూన్‌ బెల్లం తురుములో టేబుల్‌ స్పూన్‌ కలబంద గుజ్జు వేసి బాగా కలిపి పేస్టులా తయారు చేయాలి. దీనిని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇది చర్మాన్ని నునుపు చేస్తుంది.

  • టేబుల్‌ స్పూన్‌ బెల్లం తురుములో తేనె, పసుపు, నిమ్మరసం ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగాలి. ఈ ప్యాక్‌ మొటిమలను తగ్గించి, చర్మాన్ని నిర్వీషికరణ చేస్తుంది.

  • టేబుల్‌ స్పూన్‌ బెల్లం తురుములో టేబుల్‌ స్పూన్‌ గంధం పొడి, టేబుల్‌ స్పూన్‌ రోజ్‌ వాటర్‌ పోసి బాగా కలిపాలి. దీనిని ముఖానికి రాసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే చర్మం సహజ మెరుపు సతరించుకుంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ను అరెస్ట్

Read Latest AP News and National News

Updated Date - Aug 21 , 2025 | 05:24 AM