Beauty Tips: అందంగా ఉండాలంటే
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:12 AM
అందంగా కనిపించాలంటే శిరోజాలు, చర్మం, కళ్లు, పెదాలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం రోజూ పాటించాల్సిన ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం...
అందంగా కనిపించాలంటే శిరోజాలు, చర్మం, కళ్లు, పెదాలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం రోజూ పాటించాల్సిన ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం...
రోజూ ఉదయాన్నే అవకాడో ముక్కలు చేర్చిన సలాడ్ తినాలి. సాయంత్రం పూట అవకాడో గుజ్జులో కొద్దిగా తేనె, నిమ్మరసం, బాదం నూనె కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. స్నానానికి ముందు అవకాడో నూనెతో ఒళ్లంతా మర్ధన చేసుకుంటే చర్మం నిగారిస్తుంది.
కీర దోస రసంలో కాస్త తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వేళ్లతో సున్నితంగా రుద్దాలి. పావుగంట తరవాత మంచినీళ్లతో కడిగేసుకుంటే ముఖానికి మంచి ఛాయ వస్తుంది. చర్మం తేమతో నిండి చక్కగా మెరుస్తూ ఉంటుంది.
కొడిగుడ్డులోని తెల్ల సొనను నుదుటిమీద, చెంపలకు పట్టించి బాగా ఆరిన తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. ముడుతలు, గీతలు మాయమై ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఒక గిన్నెలో కోడిగుడ్డు సొనలు, కొద్దిగా కొబ్బరినూనె, కాస్త నువ్వుల నూనె వేసి బాగా గిలక్కొట్టి తలకు పట్టించాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా రెండు రోజులకు ఓసారి చేస్తూ ఉంటే కుదుళ్లు బలపడి శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరుగుతాయి.
రోజూ పెరుగు లేదా మజ్జిగను ఆహారంలో చేర్చుకోవాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. తరచూ శిరోజాలకు, ముఖానికి పెరుగుతో ప్యాక్ వేసుకుంటూ ఉంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది
ఒక గిన్నెలో రెండు చెంచాల కలబంద గుజ్జు, చిటికెడు పసుపు, ఒక చెంచా ఆలివ్ లేదా బాదం నూనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు, నల్ల మచ్చలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రాకుండా ఉంటాయి.
బీట్‌రూట్ రసంలో కొద్దిగా తేనె కలిపి రాస్తే పెదాల నలుపుదనం తగ్గుతుంది. కొద్దిగా ఆముదాన్ని తీసుకుని రోజూ కనుబొమ్మలకు రాస్తూ ఉంటే అవి ఒత్తుగా పెరుగుతాయి. పోషకాహారం తీసుకుంటూ సమయానుసారం నిద్రిస్తే కళ్లు ప్రకాశవంతంగా ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News