Bandhani Sarees Traditional Art: బహు చక్కని బాంధని
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:17 AM
సాధారణ మహిళల నుంచి ప్రముఖుల వరకు ‘బాంధని’ డిజైన్ చీరలను ఇష్టపడని వారుండరు. పండుగలు, పార్టీలు, శుభకార్యాలు ఇలా అన్ని సందర్భాల్లో మహిళలు బాంధని చీరలను ధరించి మురిసిపోతుంటారు....
ఫ్యాషన్
సాధారణ మహిళల నుంచి ప్రముఖుల వరకు ‘బాంధని’ డిజైన్ చీరలను ఇష్టపడని వారుండరు. పండుగలు, పార్టీలు, శుభకార్యాలు ఇలా అన్ని సందర్భాల్లో మహిళలు బాంధని చీరలను ధరించి మురిసిపోతుంటారు. ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన డిజైన్లకు సరికొత్త హంగులద్ది నేటి ఫ్యాషన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దిన రంగురంగుల చీరలను యువతులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఇలా అన్ని వయసులవారిని అలరిస్తున్న బాంధని డిజైన్లపై ఓ లుక్కేద్దామా...
‘బాంధని’ అనేది ఓ సంప్రదాయ వస్త్ర కళ. ముందుగా ఓ సాదా చీర మీద దారాల సహాయంతో ముడులు చుడతారు. ఇలా ముడులతోనే రకరకాల డిజైన్లు రూపొందిస్తారు. తరువాత ఈ చీరని చక్కని రంగులో ముంచి ఆరబెడతారు. చీర పూర్తిగా ఆరిన తరువాత ముడులు విప్పేస్తారు. అంతే బాంధని డిజైన్ చీర రెడీ అయిపోతుంది. ఇలా టై అండ్ డై విధానంలో చుక్కలు, చదరాలు, పూలు, లతలు, అలల సమూహాలతో ఎన్నో విభిన్నమైన డిజైన్లను రూపొందిస్తున్నారు.
కాటన్, సిల్క్, చందేరి, షిఫాన్, టస్సర్, ఆర్గంజా ఇలా ఎన్నో రకాల చీరల మీద బాంధని డిజైన్లను తీర్చిదిద్దుతున్నారు. వీటికి జర్దోసి, ఎంబ్రాయిడరీ, కుందన్, అద్దాలు, పూసల వర్క్‌లు జోడించి మరింత గ్రాండ్‌గా అందుబాటులోకి తెస్తున్నారు. వీటిని బొటిక్‌లు, షాపుల్లోనే కాదు ఆన్‌లైన్లో కూడా మహిళలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. పలు నగరాల్లో బాంధని డిజైన్ చీరల కోసం ప్రత్యేకమైన షాపులు ఉండడం విశేషం.
బాంధని డిజైన్లు... యువతులకు, మధ్య వయసు మహిళలకు చక్కగా నప్పుతాయి. కాలేజీలు, కార్యాలయాలకు వెళ్లేవారు రోజువారీ ధరించడానికి సాదా డిజైన్లను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. వివాహాది శుభకార్యాలకు గ్రాండ్ లుక్‌నిచ్చే బాంధని చీరలు కట్టుకుంటే అందంగా హుందాగా కనిపిస్తారు. ఈ చీరల మీద చక్కగా నగలు పెట్టుకోవచ్చు. విభిన్నమైన హెయిర్ స్టయిల్స్ ప్రయత్నించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్
ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
For More AP News And Telugu News