పచ్చబొట్లతో ప్రమాదాలు
ABN , Publish Date - Mar 04 , 2025 | 06:41 AM
పచ్చబొట్లు ప్యాషన్‌లో భాగమైపోయాయి. నలుగురినీ ఆకట్టుకునే అందమైన పచ్చబొట్టు పొడిపించుకునేటప్పుడు దాంతో పొంచి ఉండే ప్రమాదాలను కూడా గుర్తు పెట్టుకోవాలి....
అవగాహన
పచ్చబొట్లతో ప్రమాదాలు
పచ్చబొట్లు ప్యాషన్‌లో భాగమైపోయాయి. నలుగురినీ ఆకట్టుకునే అందమైన పచ్చబొట్టు పొడిపించుకునేటప్పుడు దాంతో పొంచి ఉండే ప్రమాదాలను కూడా గుర్తు పెట్టుకోవాలి.
అలర్జీలు: టాటూల కోసం ఉపయోగించే సిరాతో, ప్రత్యేకించి ఎర్ర సిరాతో కొందరికి చర్మపు అలర్జీలు తలెత్తుతాయి. దాంతో పచ్చబొట్టు పొడిపించుకున్న చోట దురదలు, దద్దుర్లు ఏర్పడతాయి. అలాగే పచ్చబొట్టు పొడిపించుకున్న ప్రదేశం ఎండకు బహిర్గతం అవడం వల్ల కొందర్లో ఫొటోఅలర్జిక్ రియాక్షన్ కూడా తలెత్తుతుంది
ఇన్‌ఫెక్షన్లు: టాటూలు చర్మపు సహజసిద్ధ రక్షణ పొరను ఛిద్రం చేస్తాయి. పరిశుభ్రత, స్టెరిలైజేషన్‌లను పాటించకపోతే వాటితో చర్మపు ఇన్‌ఫెక్షన్లు వేధిస్తాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లతో పాటు, కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలుంటాయి.
కెలాయిడ్ మచ్చలు: కొందర్లో కెలాయిడ్ స్కారింగ్ సమస్య ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లలో టాటూ వేయించుకున్న ప్రదేశం ఉబ్బెత్తుగా, అందవిహీనంగా మారిపోతుంది. అలాగే ఎమ్మారై స్కానింగ్ సమయంలో టాటూలు ఇబ్బందికరంగా మారతాయి. ఇమేజింగ్ నాణ్యతను దెబ్బతీస్తాయి.
చర్మం పలుచన: సోరియాసిస్ లాంటి చర్మ సమస్యలున్నవాళ్లలో టాటూల వల్ల చర్మం మరింత పలుచబడి, మచ్చలు ఏర్పడతాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
టాటూలు వేయించుకునే ముందు, వైద్యుల చేత చర్మ తత్వాన్ని పరీక్షించుకోవాలి.
నాణ్యమైన సిరా, పనిముట్లు వాడే టాటూ కళాకారులను ఎంచుకోవాలి
అనుభవమున్న, పరిజ్ఞానమున్న ఆర్టిస్టులకే ప్రాధాన్యం ఇవ్వాలి
సున్నిత చర్మం కలిగి ఉన్న వాళ్లు టాటూలకు దూరంగా ఉండడమే మేలు
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: చిట్‌ఫండ్స్ బాధితులను ఆదుకొనే దిశగా చర్యలు
Also Read : ఏపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు
Also Read: సీఎం మార్పు తథ్యం.. ఎప్పటి లోగా అంటే..
Also Read: ఈ పని చేస్తే.. ప్రభుత్వ పథకాలు ఫట్
Also Read: రంగంలోకి మీనాక్షి నటరాజన్
Also Read: హై బీపీతో ఇబ్బంది పడుతున్నారా.. జస్ట్ 5 నిమిషాలు ఇలా చేయండి..
For AndhraPradesh News And Telugu News