పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలి వెళుతున్నారా?
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:47 AM
ఒక్కోసారి పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి తల్లిదండ్రులు బయటికి వెళ్లాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యమైన పనుల వల్ల ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు కూడా! తల్లిదండ్రులు ఇద్దరూ...
ఒక్కోసారి పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి తల్లిదండ్రులు బయటికి వెళ్లాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యమైన పనుల వల్ల ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు కూడా! తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఇలాంటి సందర్భాలు తరచుగా ఎదురవుతూ ఉంటాయి. ఇలా పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం వల్ల వాళ్లు స్వతంత్రంగా, బాధ్యతగా, ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇలాంటప్పుడు తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం పిల్లలంతా మొబైల్స్ వాడుతున్నారు. వాటిలో అమ్మ, నాన్న ఫోన్ నెంబర్లతోపాటు దగ్గరి బంధువులు, పక్కింటివారి ఫోన్ నెంబర్లను సేవ్ చేసి పెట్టాలి. అలాగే ఈ నెంబర్లను ఓ నోట్‌బుక్‌లో రాసి పిల్లలకు అందుబాటులో ఉంచడం మంచిది. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలో పిల్లలకు ముందుగానే చెప్పాలి. బయటికి వెళ్లిన తరవాత కనీసం అరగంటకు ఒకసారైనా పిల్లలకు ఫోన్ చేసి వాళ్లు ఎలా ఉన్నారో తెలుసుకుంటూ ఉండాలి.
పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా టీవీ లేదా యూట్యూబ్ చూస్తూ, వీడియో గేమ్‌లు ఆడుతూ సమయం గడిపేస్తూ ఉంటారు. ఇలా ఫోన్, ల్యాప్‌టా్‌పలను ఎక్కువగా వాడడం వల్ల వచ్చే అనర్థాల గురించి పిల్లలకు వివరించి చెప్పాలి. స్ర్కీన్ టైమ్ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించడం మంచిది.
పిల్లలు తినడానికి చిరుతిండి, అల్పాహారం లాంటివి వేర్వేరు బాక్సుల్లో సర్ది ఏది ఎప్పుడు తినాలో చెప్పాలి. గ్యాస్ స్టవ్, స్విచ్ బోర్డుల దగ్గరికి వెళ్లవద్దని చెప్పాలి. పదునైన చాకులు, కత్తెరలు పిల్లలకు అందుబాటులో లేకుండా చూసుకోవాలి.
ఎవరైనా తలుపు తట్టినప్పుడు బయట ఎవరు ఉన్నారో తెలిసేవరకూ తలుపు తెరవ వద్దని పిల్లలకు గట్టిగా చెప్పాలి. ఒకవేళ తెలిసినవారు వచ్చినా వెంటనే అమ్మానాన్నలకు ఫోన్ చేసి తలుపు తీయాలా ?వద్దా? అనేది అడగాలని చెప్పాలి. ఇంటి ముందు సెక్యూరిటీ కెమెరా అమర్చుకుంటే తలుపు ఎవరు తట్టారో సులభంగా తెలుసుకోవచ్చు. మీరు ఇంట్లో లేని సమయంలో బంధువులు లేదా స్నేహితులను ఇంటికి రానీయకపోవడం మంచిది.
ఇవి కూడా చదవండి..
Shocking Video: సముద్రంపై ఓడ.. కమ్ముకొస్తున్న తుఫాను.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి..
Viral Stunt Video: వామ్మో.. ఈ కుర్రాడి ట్యాలెంట్ చూస్తే అబ్బురపోవాల్సిందే.. వీడియో వైరల్..
Lion Viral Video: సింహం పిల్ల చిలిపి పని.. ఉలిక్కి పడిన మృగరాజులు.. వీడియో చూస్తే నవ్వుకోవాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..