Share News

పిల్లలు అడిగిందల్లా ఇచ్చేస్తున్నారా?

ABN , Publish Date - Mar 12 , 2025 | 05:58 AM

పిల్లలు సాధారణంగా కంటికి ఆకర్షణీయంగా కనిపించిన ప్రతీదీ కావాలని అడుగుతూ ఉంటారు. ఇలా అడిగిందల్లా ఇవ్వడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు....

పిల్లలు అడిగిందల్లా ఇచ్చేస్తున్నారా?

పిల్లలు సాధారణంగా కంటికి ఆకర్షణీయంగా కనిపించిన ప్రతీదీ కావాలని అడుగుతూ ఉంటారు. ఇలా అడిగిందల్లా ఇవ్వడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పిల్లల కోరికలు, వాటిని నెరవేర్చడం మధ్య తల్లిదండ్రులు ఎలా సమతూకం పాటించాలో తెలుసుకుందాం.

  • పిల్లలు అడిగినవన్నీ తెచ్చి ఇస్తూవుంటే వాళ్లలో మొండితనం పెరుగుతుందని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. అలాగని పిల్లలు ఏమి అడిగినా పట్టించుకోకపోతే వారిలో నిరాశ పెరుగుతుంది. పిల్లల వయసును దృష్టిలో ఉంచుకొని వారి అవసరాల మేరకు ఏది తప్పనిసరిగా కావాలో అడిగి తెలుసుకుని దాన్ని మాత్రమే తల్లిదండ్రులు కొనిస్తే సరిపోతుంది.

  • పిల్లలకు ఏదోఒకటి కొనిచ్చి తాత్కాలికంగా సంతోషపెట్టే బదులు వాళ్లకి ఉపయోగపడేవాటిని మాత్రమే తల్లిదండ్రులు తేవడం మంచిది.

  • ఖరీదైన బొమ్మలు, డిజిటల్‌ గేమ్స్‌, ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్స్‌ లాంటివి పిల్లల సామర్థ్యాన్ని పెంచలేవు. వీటివల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి, సంభాషించే సామర్థ్యం, భాషా నైపుణ్యం, సందర్భాన్ని అర్థం చేసుకునే పరిణతి లాంటివి అలవడవు. పిల్లల శరీర బరువు పెరిగి వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఏర్పడవచ్చు. సాధ్యమైనంత వరకూ పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ వారితో రకరకాల ఆటలు ఆడించడం మంచిది.


  • స్నేహితుల దగ్గర ఉందనో, తన వద్ద ఉంటే గొప్పగా ఉంటుందనో ఇలా పలు రకాల కారణాలతో పిల్లలు ఏవేవో అడుగుతూ ఉంటారు. పిల్లలు ఏమి అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారు? అనే అంశాలపై తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి రావాలి. వీలైతే పిల్లలతో సవివరంగా మాట్లాడవచ్చు. సరైన కారణం దొరకని పక్షంలో పిల్లలకు నచ్చజెబుతూ వారి మనసు మళ్లించే ప్రయత్నం చేయాలి.

  • పిల్లలు అడిగినవన్నీ ఇవ్వకుండా తల్లిదండ్రులు కొన్ని హద్దులు నిర్దేశించడం అలవాటు చేసుకోవాలి. పిల్లల మనసు నొచ్చుకుంటుందనీ, వాళ్లు ఏడుస్తున్నారనీ అడిగిన ప్రతీదాన్నీ తెచ్చి ఇచ్చే ప్రయత్నాలు చేయకూడదు. దీనివల్ల పిల్లల్లో మానసిక సమస్యలు ఏర్పడతాయి.

  • పిల్లలు ఆడిగిన వస్తువును కొనకుండా అద్దెకు తీసుకు వచ్చే వీలుందా? ఎవరి దగ్గర నుంచైనా తీసుకునే అవకాశం ఉందా? సొంతంగా తయారు చేసుకునే వెసులుబాటు ఉందా? అనే అంశాలను తల్లిదండ్రులు పరిశీలించాలి. వీటి గురించి పిల్లలతో చర్చిస్తే వాళ్లలో ఉత్పాదకత సామర్థ్యం పెరుగుతుంది.

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ

Also Read: నా చేతిలో కత్తి పెట్టి..

Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 12 , 2025 | 05:58 AM