Anvita : ఆమె లక్ష్యం, గమ్యం... ఏడు ఖండాల్లో ఏడు శిఖరాలు
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:41 AM
సామాన్య కుటుంబంలో పుట్టిన ఆమె అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఏడు ఖండాల్లోని ఏడు పర్వతాల ఆరోహణ లక్ష్యంగా సాగుతున్న ఆమె ప్రయాణం... ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు అయిదో శిఖరాగ్రాన్ని చేరుకుంది. అర్జెంటీనాలోని అకాంగోవా పర్వతంపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి... ‘భారత్‌మాతాకీ జైసామాన్య కుటుంబంలో పుట్టిన ఆమె అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఏడు ఖండాల్లోని ఏడు పర్వతాల ఆరోహణ లక్ష్యంగా సాగుతున్న ఆమె ప్రయాణం... ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు అయిదో శిఖరాగ్రాన్ని చేరుకుంది. అర్జెంటీనాలోని అకాంగోవా పర్వతంపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి... ‘భారత్‌మాతాకీ జై

సామాన్య కుటుంబంలో పుట్టిన ఆమె అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఏడు ఖండాల్లోని ఏడు పర్వతాల ఆరోహణ లక్ష్యంగా సాగుతున్న ఆమె ప్రయాణం... ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు అయిదో శిఖరాగ్రాన్ని చేరుకుంది. అర్జెంటీనాలోని అకాంగోవా పర్వతంపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి... ‘భారత్‌మాతాకీ జై’ అంటూ ఆమె చేసిన నినాదం కొండ కోనల్లో ప్రతిధ్వనించింది. రెట్టించిన ఉత్సాహంతో మరో రెండు పర్వతాల అధిరోహణకు సిద్ధమవుతున్న తెలుగు యువతి పడమటి అన్విత సాహసోపేతమైన కథ ఇది...
‘‘పర్వతారోహణకు ధైర్య సాహసాలతోపాటు వాతావరణ పరిస్థితులను తట్టుకొనే దారుఢ్యం, ఓర్పు, సమయస్ఫూర్తి ఉండాలి. దాని కోసం నిరంతరమైన సాధన అవసరం అవుతుంది. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో ఉన్న అకాంగోవా పర్వతారోహణ కూడా ఎన్నో సవాళ్ళు విసిరింది. ఈ నెల (2025 జనవరి) 10వ తేదీన మన దేశంలో బయలుదేరి... 12వ తేదీన అర్జెంటీనా చేరుకున్నాను. సముద్ర మట్టానికి 6,961 మీటర్ల ఎత్తులో ఉన్న అంకాగోవా పర్వతాన్ని ఎక్కడానికి అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తి చేశాను. మా బృందంలో మొత్తం తొమ్మిదిమంది ఉన్నాం. అయిదుగురు మహిళలం, నలుగురు పురుషులు. మేము 13వ తేదీన బేస్‌క్యాంప్ నుంచి పర్వతారోహణ ప్రారంభించాం. మైనస్ 25 నుంచి మైనస్ 30 డిగ్రీల అతి శీతలమైన వాతావరణంలో, తీవ్రమైన చలిగాలుల మధ్య మా యాత్ర సాగింది. బేస్‌క్యాం్‌పనకు, గమ్యానికి మధ్య 70 శాతం భాగం మంచుతో కప్పేసి ఉంది. మిగిలిన భాగమంతా జారుడుగా ఉన్న రాళ్ళ మార్గం. దాదాపు 6 వేల మీటర్ల ఎత్తుకు చేరుకొనేసరికి... పరిస్థితులను భరించలేక ఆరుగురు వెనుతిరిగారు. ఇద్దరు పురుషులు, నేను మాత్రమే గమ్యాన్ని చేరుకోగలిగాం. 13 రోజులపాటు సాగిన మా ఆరోహణ.... మన గణతంత్ర దినమైన జనవరి 26వ తేదీ ఉదయంఅకాంగోవా శిఖరాగ్రం దగ్గర ముగిసింది. అక్కడ మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను. ‘భారత్ మాతాకీ జై’ అని నినదిస్తూ మన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపాను. ఆ క్షణంలో... నాలో ఏదో మహత్తరమైన భావోద్వేగం.
భువనగిరి ఖిల్లా మీద...
మాది తెలంగాణలోని యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి. నాన్న పడమటి మధుసూదన్‌రెడ్డి వ్యవసాయం చేస్తారు. అమ్మ చంద్రకళ అంగన్వాడీ టీచర్. నాలుగేళ్ళ క్రితం ఎంబీయే పూర్తి చేశాను. పర్వతారోహణ పట్ల నా ఆసక్తిని గమనించిన ట్రాన్సెండ్ అడ్వంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎం.డి. ఎవరెస్టర్ శేఖర్‌బాబు ఆ దిశగా ప్రోత్సహించారు. ఆయన పర్యవేక్షణలో భువనగిరి ఖిల్లా మీద నా ప్రాథమిక శిక్షణ సాగింది. అప్పుడే ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. దేశ, విదేశాల్లోని అనేక పర్వతాల ఆరోహణతో నా సామర్థ్యానికి మెరుగులు దిద్దుకున్నాను. ఆఫ్రికా ఖండంలో... సముద్రమట్టానికి 5,896 మీటర్ల ఎత్తులో ఉన్న ఖిలిమంజారోను 2020 జనవరిలో అధిరోహించడంతో నా సప్త ఖండాల పర్వతారోహణ మొదలయింది. 2021 డిసెంబరు 7న 5,642 మీటర్ల ఎత్తైన ఎల్‌బ్రస్ (యూరప్), 2022 మే 16న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 8,848.86 మీటర్ల ఎవరెస్ట్ శిఖరం (ఆసియా ఖండం), 2022 డిసెంబరు 17న సముద్రమట్టానికి 4,892 మీటర్ల ఎత్తులో ఉన్న విన్సన్ (అంటార్కిటికా) పర్వతాలను అధిరోహించాను. అయిదవదిగా... దక్షిణ అమెరికా ఖండంలోని అకాంగోవా కూడా పూర్తయింది. దీనికి హైదరాబాద్‌కు చెందిన అన్విత కన్‌స్ట్రక్షన్స్ ఆర్థిక సాయం చేసింది. ట్రాన్సెండ్ అడ్వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం అన్విత ట్రాన్సెండ్ అకాడమీ సీనియర్ ఇన్‌స్రక్టర్‌గా పని చేస్తున్నాను. ఇంకా... ఉత్తర అమెరికా ఖండంలోని అలస్కాలో... సముద్ర మట్టానికి 6,990 మీటర్ల ఎత్తులో ఉన్న డెనాలీ పర్వతాన్ని, అస్ర్టేలియాలో సముద్రమట్టానికి 2,228 మీటర్ల ఎత్తైన ఖోజిస్కో పర్వతాన్ని అధిరోహించాలి. త్వరలోనే వాటిని కూడా ఎక్కి... నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాను.’’
పోతంశెట్టి కరుణాకర్
భువనగిరి టౌన్
ఇవి కూడా చదవండి..
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు
Read More National News and Latest Telugu News