Share News

Pollution Linked to Rising Dementia Risk: గాలి కాలుష్యంతో డిమెన్షియా

ABN , Publish Date - Oct 28 , 2025 | 01:47 AM

గాలి కాలుష్యం వల్ల 2000 నుంచి 2023 మధ్య కాలంలో భారతదేశంలో మరణాల సంఖ్య 14 లక్షలకు పెరిగింది. ఈ ముప్పు గురించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు...

Pollution Linked to Rising Dementia Risk: గాలి కాలుష్యంతో డిమెన్షియా

అధ్యయనం

గాలి కాలుష్యం వల్ల 2000 నుంచి 2023 మధ్య కాలంలో భారతదేశంలో మరణాల సంఖ్య 14 లక్షలకు పెరిగింది. ఈ ముప్పు గురించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు...

గాలి కాలుష్యం కేవలం శ్వాసకోస సమస్యలకే పరిమితం కాదని, దీంతో డిమెన్షియా ముప్పు కూడా పొంచి ఉంటుందనీ స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ 2025 నివేదిక వెల్లడిస్తోంది. గాలి కాలుష్యం ఫలితంగా 2023లో ఆరున్నర లక్షల మంది డిమెన్షియా బారిన పడినట్టు, ప్రపంచవ్యాప్త డిమెన్షియా మరణాలు 29 శాతానికి చేరుకున్నట్టు ఈ నివేదిక పేర్కొంటోంది. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన వైద్య విధానాలు, పెరిగిన ఆయుర్దాయాల ఫలితంగా, మరీ ముఖ్యంగా వృద్ధులు, గాలిలోని సూక్ష్మ అణువులకు బహిర్గతమవుతూ ఊపిరితిత్తులు, గుండె, మెదడు సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. ఈ సూక్ష్మ కలుషితాలు ఊపిరితిత్తుల ద్వారా రక్తప్రవాహంలోకి చొరబడి, అంతిమంగా మెదడుకు చేరుకుంటున్నాయి. అక్కడకు చేరుకున్న ఈ కలుషితాలు ఇన్‌ఫ్లమేషన్‌, ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌లను ప్రేరేపిస్తూ, మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తూ, నాడీక్షీణతను పెంచుతున్నాయి. ఈ ప్రక్రియ అల్జీమర్స్‌, వ్యాస్క్యులర్‌ డిమెన్షియాల ముప్పును పెంచుతోంది. వీటి వల్ల జ్ఞాపకశక్తి క్రమేపీ క్షీణించి, ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి పెరుగుతుంది. గాలి కాలుష్యానికి బహిర్గతం అవడం మూలంగా పిల్లల మెదడు ఎదుగుదల, పనితీరు కూడా కుంటుపడుతుందని నివేదిక పేర్కొంటోంది. ఫలితంగా ఆటిజం లాంటి నాడీసంబంధ రుగ్మతలతో పాటు, ఆందోళన, కుంగాబాటు లాంటి మానసిక సమస్యలు కూడా వేధిస్తాయని నివేదిక పేర్కొంటోంది. ధూమపానం, పోషకాహార లోపాలే డిమెన్షియాకు ప్రధాన కారణాలు అయినప్పటికీ, ఇందుకు గాలి కాలుష్యం కూడా దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

For More AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 01:48 AM