ఐఐటీల్లో ఏఐ కోర్సులు
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:51 AM
ఐఐటీలాంటి సంస్థల్లో చదువుకోలేక పోతున్నాం అని బాధ పడాల్సిన అవసరమే వద్దు. దేశంలోని చాలా ఐఐటీలు పలు విభాగాలకు సంబంధించిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐటీ ఫ్యాకల్టీల...
ఐఐటీలాంటి సంస్థల్లో చదువుకోలేక పోతున్నాం అని బాధ పడాల్సిన అవసరమే వద్దు. దేశంలోని చాలా ఐఐటీలు పలు విభాగాలకు సంబంధించిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి. ఐఐటీ ఫ్యాకల్టీల ఆధ్వర్యంలో నడిచే ఈ కోర్సుల్లో చేరితే తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో వీటిని పొందవచ్చు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. తమ రెగ్యులర్ చదువులు కొనసాగిస్తూనే వీటిలో చేరవచ్చు. రాబోయే కాలం అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్‌దే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐఐటీ మద్రాస్, రూర్కీలు కొన్ని కోర్సులను రూపొందించాయి.
ఐఐటీ మద్రాస్: వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ను ఉద్దేశించి ఐఐటీ మద్రాస్ ‘వెబ్ ఎంటెక్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్’ కోర్సును ప్రారంభించింది. 2025 మే 31లోపు ఈ కోర్సులో చేరవచ్చు. దీనితోపాటుగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్(ఏరో స్పేస్, అమ్యునిషన్ టెక్నాలజీ), ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ), ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్(ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్, మల్టీ మీడియా, మైక్రో ఎలకా్ట్రనిక్స్), మెకానికల్ ఇంజనీరింగ్(మెకానికల్ డిజైన్, అటోమోటివ్ టెక్నాలజీ), ఈ మొబిలిటీ తదితర కోర్సులు ఉన్నాయి. వివరాల కోసం code.iitm.ac.in/ webmtech
ఐఐటీ రూర్కీ: ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఏఐ, జెన్ ఏఐ, ఎజెంటిక్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్’లలో పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇది పదకొండు నెలల ప్రోగ్రామ్. లైవ్, రికార్డెడ్ సెషన్స్‌లో ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు హాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉండేలా డిజైన్ చేశారు. వివరాల కోసం www.iitr.ac.in// వెబ్‌సైట్ చూడవచ్చు.
ఇవి కూడా చదవండి..
ఎస్‌బీఐ రిటైల్ లోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లల్లో కోత!
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
మరిన్ని తెలుగు, బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..