Share News

Skincare : ముఖాన్ని ఇలా మెరిపించండి!

ABN , Publish Date - Jan 27 , 2025 | 05:24 AM

ముఖం అందంగా ఆరోగ్యంగా కనిపించాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. రసాయనభరితమైన సౌందర్య సాధనాలు కాకుండా ఇంట్లో దొరికే వాటితోనే ప్యాక్‌ తయారుచేసుకుని వాడితే ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. ఆ వివరాలు...

Skincare : ముఖాన్ని ఇలా మెరిపించండి!

ముఖం అందంగా ఆరోగ్యంగా కనిపించాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. రసాయనభరితమైన సౌందర్య సాధనాలు కాకుండా ఇంట్లో దొరికే వాటితోనే ప్యాక్‌ తయారుచేసుకుని వాడితే ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. ఆ వివరాలు...

  • పండిన అరటిపండును తొక్కతీసి చిన్న ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేయాలి. చెంచాతో వాటిని గుజ్జులా చేయాలి. అందులో రెండు చెంచాల పాలు, ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరవాత మంచినీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ వల్ల చర్మానికి తేమ అంది సహజసిద్దంగా మెరుస్తుంది.

  • ఒక గిన్నెలో ఒక చెంచా గ్లిజరిన్‌, ఒక చెంచా గులాబీ నీళ్లు, ఒక చెంచా బంగాళదుంప రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని కింది నుంచి పైకి రాస్తూ ముఖానికి, మెడకి పట్టించాలి. ముక్కుకు ఇరుపక్కలా, నుదుటి మీద సున్నితంగా మర్దన చేయాలి. అరగంట ఆరిన తరవాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌.... బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేసి చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది. నలుపుదనమంతా తొలగిపోయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.

  • ఒక గిన్నెలో అయిదు చెంచాల బార్లీ గింజల పొడి వేసి అందులో గోరువెచ్చని నీళ్లు చల్లుతూ ముద్దలా చేయాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో కొద్దిగా తీసుకుంటూ ముఖమంతా పరచాలి. పదిహేను నిమిషాలు ఆరిన తరవాత ముని వేళ్లతో మెల్లగా రుద్దుతూ మిశ్రమాన్ని తొలగించి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ వల్ల చర్మంపై పేరుకున్న మృతకణాలు, మురికి తొలగిపోతాయి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

  • స్టవ్‌ మీద గిన్నె పెట్టి అరగ్లాసు పాలు, మూడు చెంచాల ఓట్స్‌ వేసి ఉడికించాలి. చల్లారిన తరవాత ఇందులో ఒక చెంచా పెరుగు, ఒక చెంచా తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించాలి. ఇరవై నిమిషాలు ఆరిన తరవాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ వల్ల బ్లాక్‌ హెడ్స్‌ తొలగిపోయి ముఖం తాజాగా కనిపిస్తుంది.


ఇవి కూడా చదవండి

Uttar Pradesh: మహాకుంభమేళాకు ఇండియన్ క్రికెట్ టీమ్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..

Coldplay Ahmedabad Concert: అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే కచేరీ.. 3,800 మంది పోలీసులు.. 400 CCTVలతో భారీ భద్రత..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 27 , 2025 | 05:24 AM