Yusuf Pathan: ఓ పక్క రాష్ట్రం తగలబడుతుంటే.. చాయ్ తాగుతూ ఫోజులా.. మాజీ క్రికెటర్‌పై విమర్శలు
ABN , Publish Date - Apr 13 , 2025 | 02:22 PM
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. మాజీ క్రికెటర్, ఎంపీ ఒకరు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలు..

కోల్‌కతా: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా ఉద్రిక్త పరిస్థితులే కనబడుతున్నాయి. ఆందోళన నేపథ్యంలో చోటు చేసుకున్న హింసా కాండలో ముగ్గురు మృతి చెందగా.. 150 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక రాష్ట్రంలో నెలకొని ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. హైకోర్టు పారామిలిటరీ బలగాల మోహరింపుకు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్లో విధ్వంసకర పరిస్థితులు నెలకొని ఉన్న తరుణంలో.. మాజీ క్రికెటర్, తృణముల్ ఎంపీ ఒకరు చేసిన పోస్ట్ నెట్టింట విమర్శల పాలవుతుంది. ఆ వివరాలు..
మాజీ క్రికెటర్, బెంగాల్ ఎంపీ యూసఫ్ పఠాన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అందుకు కారణం ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్. ఓ పక్క వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో రాష్ట్రం తగలబడుతుంటే.. యూసఫ్ మాత్రం కూల్‌గా చాయ్ తాగుతున్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. వీటిని చూస్తే.. పఠాన్ తన ఎస్టేట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు అర్థం అవుతుంది. ఫొటోలను షేర్ చేయడమే కాక.. మంచి మధ్యాహ్నం వేళ.. ప్రశాంత వాతావరణంలో కూర్చొని టీ తాగుతుంటే.. వాహ్.. ఆ ఫీలే వేరు అంటూ పోస్ట్ చేశాడు పఠాన్.
ఇంకేముందు ఈ పోస్ట్ చూసిన ట్రోలర్స్.. మరీ ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు ఆయన మీద చెలరేగిపోతున్నారు. బాధ్యతగల ఎంపీ పదవీలో ఉన్న నీకు.. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియదా.. మీ తృణముల్ కార్యకర్తలు రాష్ట్రాన్ని తగలబెడుతుంటే.. ఆ మంటల్లో నువ్వు చాయ్ కాచుకుని తాగుతున్నావా.. సమాజం పట్ల నీకున్న బాధ్యత ఇదేనా.. ముర్షీదాబాద్ తగలబడుతుంటే.. నువ్వు రిలాక్స్ అవుతున్నావా.. నీకు కనీసం నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసా అని కామెంట్స్ చేస్తున్నారు. యూసఫ్ పఠాన్.. గత పార్లమెంటు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బహరామ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాడు.
ఇవి కూడా చదవండి:
Jana Sena: విశాఖలో హీట్ ఎక్కిస్తున్న జనసేన చీలికలు.. జీవీఎంసీ రాజకీయాలు
Chanakya Niti on Success: చాణక్య నీతి.. విజయానికి ఆటంకం కలిగించే అలవాట్లు ఇవే..