Share News

Supreme Court: మీ ప్రవర్తన నమ్మశక్యంగా లేదు.. జస్టిస్ యశ్వంత్‌వర్మపై సుప్రీం వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 02:44 PM

న్యాయమూర్తులు దీపంకర్ దత్తా, ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం కేసు విచారణ జరిపింది. జస్టిస్ వర్మ తరఫు కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. న్యాయపరమైన తప్పులు జరిగినప్పుడు దానిపై చర్య తీసుకునే హక్కు భారత ప్రధాన న్యాయమూర్తికి ఉంటుందని జస్టిస్ దత్తా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Supreme Court: మీ ప్రవర్తన నమ్మశక్యంగా లేదు.. జస్టిస్ యశ్వంత్‌వర్మపై సుప్రీం వ్యాఖ్యలు
Supreme Court

న్యూఢిల్లీ: తన నివాసంలో నోట్ల కట్టలు దొరికిన కేసులో త్రిసభ్య విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను సవాలు చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Varma) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారంనాడు విచారణ జరిపింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది.


న్యాయమూర్తులు దీపంకర్ దత్తా, ఏజీ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం కేసు విచారణ జరిపింది. జస్టిస్ వర్మ తరఫు కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. న్యాయపరమైన తప్పులు జరిగినప్పుడు దానిపై చర్య తీసుకునే హక్కు భారత ప్రధాన న్యాయమూర్తికి ఉంటుందని జస్టిస్ దత్తా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అదే విషయాన్ని ఆయన రాష్ట్రపతి, ప్రధానమంత్రికి చెప్పవచ్చని అన్నారు. జస్టిస్ వర్మ ప్రవర్తనపై కూడా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ వర్మ ప్రవర్తన నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించింది. విచారణ ప్యానెల్ సిఫార్సు రాజ్యంగ విరుద్ధమని భావిస్తే విచారణ కమిటీ ముందుకు జస్టిస్ వర్మ ఎందుకు హాజరయ్యారు? దీనిపై ఆయన ముందే సవాలు చేసి ఉండాల్సింది కదా? అని అసహనం వ్యక్తం చేసింది.


జస్టిస్ వర్మను తొలగించాలంటూ విచారణ కమిటీ సిఫారసు చేయడం రాజ్యాంవిరుద్ధమని కపిల్ సిబల్ తన వాదన వినిపించారు. ఈ తరహాలో తొలగించడం ప్రమాదకరమైన ఉదాహరణ కావచ్చని అన్నారు. కేసుకు సంబంధించి ఒక టేప్ అప్పటికే విడుదలై తన క్లయింట్ రెప్యుటేషన్ దెబ్బతిన్నందున ఆయన ప్యానల్‌ను గతంలో సవాలు చేయలేదని వివరణ ఇచ్చారు.


కాగా, జస్టిస్ వర్మపై ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని అడ్వకేట్ మాథ్యూస్ జె నెండుపరం చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం మండిపడింది. కోర్టును ఎఫ్ఐఆర్‌కు అనుమతించమని కోరడానికి ముందు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారా అని దీపంకర్ దత్తా ప్రశ్నించారు. అనంతరం జస్టిస్ వర్మ పిటిషన్‌ను ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు కోరుతూ నెడుంపర వేసిన మరో పిటిషన్‌పై కూడా ఆదేశాలను రిజర్వ్ చేసింది.


ఇవి కూడా చదవండి..

భారీగా ఓట్లు తొలగిస్తే.. వెంటనే జోక్యం చేసుకుంటాం!

మేఘాలయ హనీమూన్ ట్రిప్‌ రాజా రఘువంశీ నిజ జీవితం ఆధారంగా మూవీ

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 30 , 2025 | 02:52 PM