Liquor Consumption: ఆయుష్షు తీసిన ఐదు ఫుల్‌బాటిల్స్
ABN , Publish Date - May 02 , 2025 | 04:34 AM
కర్ణాటకలో ఒక యువకుడు మద్యం చరిత్ర సవాల్‌ను స్వీకరించి ఐదు బాటిళ్ల మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు.
పందెం కట్టిన స్నేహితులు
రూ.10వేల కోసం తాగి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
బెంగళూరు, మే 1(ఆంధ్రజ్యోతి): పదివేల కోసం ఆశపడ్డాడో....పౌరుషానికి పోయాడో కానీ, పందెం కోసం ఏకబిగిన మద్యం తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా పూజారహళ్లి గ్రామానికి చెందిన కార్తీక్(21), అతని స్నేహితుల మధ్య మద్యం సేవించే విషయమై సవాల్ జరిగింది. నీరు కలుపుకోకుండా ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం తాగితే రూ.10వేలు ఇస్తానని వెంకటరెడ్డి అనే వ్యక్తి చాలెంజ్ చేశాడు. కార్తీక్ ఈ సవాల్ స్వీకరించాడు. ఏకంగా ఐదు బాటిళ్ల మద్యం తాగేశాడు. కాసేపటికే అస్వస్థతకు గురవ్వడంతో కోలార్ జిల్లా ముళబాగిలు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స ఫలించక కార్తీక్ మృతి చెందాడు. వారం క్రితం జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కార్తీక్‌కు ఏడాది కిందట వివాహమైంది. వారం కిందట కొడుకు పుట్టాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నంగిలి పోలీసులు వెంకటరెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News