Share News

Marital Dispute India: పెళ్లయి 25 ఏళ్లయిన మహిళ 25 ఏళ్ల మేనల్లుడితో ప్రేమలో!

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:49 AM

పాతికేళ్లక్రితం పెళ్లయి నలుగురు పిల్లలున్న ఆ మహిళకు తన మేనల్లుడైన పాతికేళ్ల యువకుడితో..

Marital Dispute India: పెళ్లయి 25 ఏళ్లయిన మహిళ 25 ఏళ్ల మేనల్లుడితో ప్రేమలో!
Marital Dispute India

  • భర్త, నలుగురు పిల్లలను వదిలేసి అతడితో పరార్‌

లఖ్‌నవూ, జూలై 21: పాతికేళ్లక్రితం పెళ్లయి నలుగురు పిల్లలున్న ఆ మహిళకు తన మేనల్లుడైన పాతికేళ్ల యువకుడితో ప్రేమ పుట్టింది. భర్తను కాదని ఆ యువకుడితోనే తన జీవితం అనుకున్న ఆమెకు పెళ్లీడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలున్నారు! పెద్దమ్మాయి వయసు ఇరవై ఏళ్లు.. రెండో అమ్మాయి వయసు పద్దెనిమిదేళ్లు! మరో ఇద్దరు అబ్బాయిల్లో ఒకరి వయసు 17 ఏళ్లు.. మరొకరి వయసు 10ఏళ్లు! కట్టుకున్న భర్తను, కడుపున పుట్టిన పిల్లలను కాదని ఒకానొక రోజు ప్రేమికుడితో కలిసి ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. యూపీలోని సిద్ధార్థ్‌నగర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రియుడి వెంట ఆమె వెళ్లిపోవడంతోనే స్టోరీ ముగియలేదు. ఇక్కడి నుంచే ట్విస్టుల మీద ట్విస్టులతో కథ సాగింది! కుటుంబ పోషణ కోసం నెలలో చాలా రోజులు ఆ భర్త ఇంటికి దూరంగా ఉంటుంటే.. ఆ ఇంటికి ఆమె మేనల్లుడు(25) తరచూ వచ్చేవాడు! ఆ ఇల్లాలికి, ఆ యువకుడి మధ్య చనువు పెరిగి.. అది ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. గత ఏడాది ఆమె, తన ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. దీనిపై ఆ భర్త, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్నాళ్లకు ఆ యువకుడితో గొడవలు తలెత్తడంతో ఆమె తిరిగి తన భర్త దగ్గరకు వచ్చేసింది. ఆమెను పెద్ద మనసుతో భర్త క్షమించేసి అక్కున చేర్చుకున్నాడు. అటు.. ఆమె ప్రియుడు కూడా ఇక ఎంతమాత్రం కలిసి ఉండే ప్రసక్తేలేదని పోలీసుల సాక్షిగా చెప్పాడు. అయితే కొన్నాళ్లకు.. ఆమె మళ్లీ ఇంట్లోకి వెళ్లిపోయి ప్రియుడి చెంతకు చేరింది. ఆదివారం అతడిని వెంటబెట్టుకొని ఊరొచ్చేసింది. బంధువులు, గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. తనకు భర్త వద్దని, ప్రియుడితోనే కలిసి ఉండాలనుకుంటున్నట్లు పెద్దల ఎదుట ఆమె స్పష్టం చేసింది. ‘నాతో కలిసి ఉండటానికి ఆమెకు ఇష్టంలేకపోతే.. ఆమెను నిరోధించే హక్కు నాకెక్కడిది?’ అని చెబుతూ ప్రియుడితో కలిసి వెళ్లిపోయేందుకు భర్త అనుమతినిచ్చాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:49 AM